Zomato row : జొమాటో డెలివరీ బాయ్ కేసు, కొత్త ట్విస్ట్..యువతిపై కేసు పెట్టాడు

తనపై డెలివరీ బాయ్ దాడి చేసినట్లు ఓ యువతి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన సంగతి తెలిసిందే కదా. ఇందులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది.

Zomato row : జొమాటో డెలివరీ బాయ్ కేసు, కొత్త ట్విస్ట్..యువతిపై కేసు పెట్టాడు

Bengaluru

Kamaraj files FIR : తనపై డెలివరీ బాయ్ దాడి చేసినట్లు ఓ యువతి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన సంగతి తెలిసిందే కదా. ఇందులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. గత కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య వివాదం చెలరేగుతోంది. బెంగళూరు నగరానికి చెందిన హితేషా చంద్రాన్ అనే మహిళై దాడి చేశాడన్న ఆరోపణలపై డెలివరీ బాయ్ కామరాజ్ ను బెంగళూరు పోలీసులు అరెస్టు చేసి, స్టేషన్ బెయిల్ పై విడుదల చేశారు. తనపైనే దాడి చేసి కేసు పెట్టిందని ఆరోపిస్తూ..యువతిపై కేసు పెట్టడం గమనార్హం.

ఏ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిందో..అదే స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు..ఆమెను విచారణకు పిలిపించారు. తాను బెంగుళూరులో లేనని, అత్తవారింట్లో ఉన్నట్లు తెలిపిందని పోలీసులు వెల్లడించారు. బెంగుళూరుకు వచ్చిన అనంతరం ఆమె స్టేట్ మెంట్ నమోదు చేయడం జరుగుతుందని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, స్టేట్ మెంట్ ఇచ్చేందుకు ముందుకు రాకపోతే..ఆమెను అరెస్టు చేయడం జరుగుతుందన్నారు.

మార్చి 09వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. హితేషా చంద్రాన్ యువతి..జొమాటో ఫుడ్ ఆర్డర్ ఇచ్చింది. అయితే..ఆలస్యం అయినందుకు..ఫ్రీగా ఫుడ్ ఇవ్వాలేని లేకపోతే..ఆర్డర్ క్యాన్సిల్ చేయాలని తాను కోరడం జరిగిందని హితేషా..ఇన్ స్ట్రాగ్రామ్ ద్వారా సోషల్ మీడియా ద్వారా పోస్టు చేసింది. ఫుడ్ తీసుకొచ్చిన డెలివరీ బాయ్ తనపై దాడి చేశాడంటూ..పోస్టులో వెల్లడించింది. ఈ ఘటన సంచలనం సృష్టించింది. అయితే..తాను దాడి చేయలేదని, తనపైనే చెప్పులతో కొట్టిందని డెలివరీ బాయ్ ఆరోపించాడు. యువతి బెంగళూరును విడిచి వెళ్లడం చర్చనీయాంశమైంది.