Petrol Rates Hike : మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

దేశంలో పెట్రోల్,డీజిల్ ధరలు రోజు రోజుకూ పెరుగూతూ పోతున్నాయి. తాజగా ఆదివారం పెట్రోధరలను పెంచారు. లీటర్ పెట్రోల్ పై 30 పైసలు, లీటర్ డీజిల్ పై31 పైసలు చమురు కంపెనీలు పెంచాయి.

Petrol Rates Hike : మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol Price Hike Today

Petrol Rates Hike : దేశంలో పెట్రోల్,డీజిల్ ధరలు రోజు రోజుకూ పెరుగూతూ పోతున్నాయి. తాజగా ఆదివారం పెట్రోధరలను పెంచారు. లీటర్ పెట్రోల్ పై 30 పైసలు, లీటర్ డీజిల్ పై31 పైసలు చమురు కంపెనీలు పెంచాయి. దీంతో దేశరాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 97.22, డీజిల్‌ ధర రూ.87.97కు చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో లీటర్‌ పెట్రోల్‌ రూ.103.36, డీజిల్‌ రూ.95.44కు పెరిగింది.

పెరిగిన పెట్రో ధరలు సామాన్యులకు చూపిస్తున్నాయి. వీటి ప్రభావం అనేక రంగాలపై పడుతోంది. దేశంలో దాదాపు 8 రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు రూ. 100 దాటింది. వాటిలో రాజస్ధాన్, మధ్యప్రదేశ్,మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, లడఖ్ లు ఉన్నాయి. వ్యాట్ ధరలలో వ్యత్యాసం, సరూకు రవాణా చార్జీలలో స్ధానిక పన్నుల కారణంగా ఆ రాష్ట్రాల్లో ధరల వ్యత్యాసం సంభవిస్తోంది.

దేశంలో అత్యధికంగారాజస్ధాన్ లోని శ్రీ గంగానగర్ లో లీటరు రూ.108.37 కు…డీజిల్ 101.12 కు చేరుకుంది. గడిచిన మే నెలలో చమురు కంపెనీలు 16 సార్లు ఇంధన ధరలను సవరించగా… ఈ జూన్ నెలలో ఇప్పటివరకు 12 సార్లు పెంచాయి. గత నెలలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పూర్తయిన తర్వాత నుంచి చమురు ధరలు పెరుగుతూ వస్తున్నాయి.

దేశంలోని వివిధ నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి

ఢిల్లీలో   పెట్రోల్‌ రూ.97.22.. డీజిల్‌ రూ.87.97
ముంబైలో   పెట్రోల్‌ రూ.103.36, డీజిల్‌ రూ.95.44
హైదరాబాద్‌లో   పెట్రోల్‌ రూ.101.04, డీజిల్‌ రూ.95.89
విజయవాడలో  రూ.102.98, డీజిల్‌ రూ.97.26
కోల్‌కతాలో   పెట్రోల్‌ రూ.102.12, డీజిల్‌ రూ.90.82
చెన్నైలో  పెట్రోల్ రూ.98.40, డీజిల్ రూ.92.58
భోపాల్‌లో   పెట్రోల్ రూ.105.43, డీజిల్‌రూ.96.65
రాంచీలో   పెట్రోల్‌రూ.93.13, డీజిల్‌రూ.92.86
బెంగళూరులో  పెట్రోల్‌రూ.100.47, డీజిల్‌రూ.93.26
పాట్నాలో  పెట్రోల్‌రూ.99.28, డీజిల్‌రూ.93.30
చండీగఢ్‌లో   పెట్రోల్‌రూ.93.50, డీజిల్‌రూ.87.62
లక్నోలో   పెట్రోల్‌రూ.94.42, డీజిల్‌రూ.88.38