వరుసగా 11వ రోజూ పెట్రో సెగలు.. ఏపీలో సెంచరీ దిశగా పరుగులు

వరుసగా 11వ రోజూ పెట్రో సెగలు.. ఏపీలో సెంచరీ దిశగా పరుగులు

fuel prices hiked for 11th straight day: దేశంలో ఇంధన ధరల సెగ కొనసాగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోడుతున్నాయి. వాహనదారుల గుండెల్లో మంటలు పుట్టిస్తున్నాయి. వరుసగా 11వ రోజు కూడా చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచాయి.

శుక్రవారం(ఫిబ్రవరి 19,2021) లీటర్ పెట్రోల్‌పై 31 పైసలు, డీజిల్ పై 33 పైసలు చొప్పున పెంచాయి. దీంతో దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో రికార్డు స్థాయి ధర నమోదైంది. దేశ రాజధానిలో పెట్రోల్ ధర లీటరుకు 90.19 కు చేరగా, డీజిల్ ధర లీటర్ కు 80.60కు చేరింది.

పెట్రోల్ సెంచరీ కొట్టిన రాష్ట్రాలు:
దేశంలో పలు రాష్ట్రాల్లో పెట్రోల్ ధర సెంచరీ కొట్టింది. ఇప్పటికే రాజస్థాన్‌లో పెట్రోల్‌ ధర లీటరుకు రూ.100 స్థాయిని దాటేసింది. గురువారం(ఫిబ్రవరి 18,2021) మధ్యప్రదేశ్‌లో కూడా పెట్రోల్ ధర సెంచరీ మార్క్‌ను అధిగమించింది. మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్‌లో పెట్రోల్‌ ధర లీటరుకు రూ.100.25 దాటడం గమనార్హం. శుక్రవారం ఇక్కడ పెట్రోలు ధర రూ.100.57 దగ్గర, డీజిల్‌ 91.04 దగ్గర కొనసాగుతున్నాయి.

పలు నగరాల్లో పెట్రోల్, డీజిల్‌ ధరలు లీటరుకు

ముంబైలో పెట్రోల్ రూ.96.32, డీజిల్ రూ.87.32

చెన్నైలో పెట్రోల్ రూ.92.25, డీజిల్ రూ.85.63

బెంగళూరులో పెట్రోల్ రూ.93.21, డీజిల్ రూ. 85.44

హైదరాబాద్‌ లో పెట్రోల్ రూ.93.78, డీజిల్ రూ.87.91

అమరావతి పెట్రోల్ రూ.96.34, డీజిల్ రూ. 89.94

విజయవాడలో పెట్రోల్ రూ.96.16, డీజిల్ రూ.89.69

విశాఖలో పెట్రోల్ రూ. 95.18, డీజిల్ రూ.88.76

మండుతున్న ఇంధన ధరలతో సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వాహనాలు తియ్యాలంటే ఆలోచిస్తున్నారు. అసలు బండ్లు నడిపేకన్నా అమ్ముకోవడమే బెటర్ అని నిట్టూరుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఇంధన ధరలను తగ్గించాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి.