Fuel Prices : 2025నాటికి భారీగా తగ్గనున్న ఇంధన ధర..ఎందుకో తెలుసా?

పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ 2009లో జాతీయ జీవ ఇంధన విధానాన్ని అమలు చేసింది. ఆ తర్వాత, జూన్ 4, 2018న దాని స్థానంలో బయో ఇంధనంపై జాతీయ విధానం-2018ని నోటిఫై చేసింది.

Fuel Prices : 2025నాటికి భారీగా తగ్గనున్న ఇంధన ధర..ఎందుకో తెలుసా?

Fuel (1)

Fuel prices : 2025 నాటికి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా తగ్గే చాన్స్ కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2025 నాటికి పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడంలో భాగంగా, ఇంధనాల్లో ఇథనాల్ మిక్సింగ్ 20 శాతం పెంపునకు కేబినేట్ ఆమోదం తెలిపింది.

దీని ద్వారా ప్రత్యామ్నాయ పర్యావరణ అనుకూల ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు, క్రూడ్ వంటి వాటి దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఇంతకు ముందు 2030 నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని నిర్దేశించుకున్నారు. అయితే ప్రస్తుతం దానిని 2025కి మార్చారు.

Dharmendra Pradhan : ఇంధన ధరల పెరుగుదలపై కేంద్ర మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ 2009లో జాతీయ జీవ ఇంధన విధానాన్ని అమలు చేసింది. ఆ తర్వాత, జూన్ 4, 2018న దాని స్థానంలో బయో ఇంధనంపై జాతీయ విధానం-2018ని నోటిఫై చేసింది. వచ్చే రెండేళ్లలో పెట్రోల్‌లో 20శాతం ఇథనాల్‌ను కలపాలని మోదీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

దీంతో చమురు దిగుమతుల భారం విషయంలో చాలా వరకు ఉపశమనం కలగనుంది. భారత్‌ ప్రస్తుతం తన ముడి చమురు అవసరాలలో 85 శాతం దిగుమతులపైనే ఆధారపడి ఉంది. ఇలాంటి పరిస్థితిలో, జీవ ఇంధన విధానం చాలా ఉపయోగకరంగా మారనుంది. ఇది దిగుమతులపై దేశం ఆధారపడటాన్ని తగ్గిస్తుంది.