Fuel Rate : వాహన ఇంధనం రూ.60 లకే ..కేంద్ర ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ ఇదే..

పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరల నుంచి ఉపశమనం కలిగించినటానికి కేంద్ర ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ తో రంగంలోకి దిగుతోంది.

10TV Telugu News

Fuel Rate..Flex-fuel engine‌ : పెట్రోల్, డీజిల్ ధరలు అత్యంత భారీగా పెరగటంతో వాహనాలు బయటకు తీయాలంటే యజవానులు హడలిపోతున్నారు. పెట్రోల్ సెంచరీ దాటేసి చాలా రోజులైంది. రోజుకు 30 పైసలు..60 పైలు పెంచుకుంటు పోయిన లీటరు పెట్రోలు రూ.110కి చేరింది. దీంతో వాహనదారుల జేబులేకాదు బ్యాంకు ఎకౌంట్లు కూడా ఖాళీ అయిపోతున్నాయి. ఒక్కో రాష్ట్రంలోను ఒక్కోరేటులతో వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి ఇంధన ధరలు. ప్రభుత్వాలమీద ప్రజలకు తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తున్నా తప్పనిపరిస్థితుల్లో ఈ భారాలను ప్రజలు భరిస్తున్నారు. ఈక్రమంలో వాహనదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. ఇంధన ధరలు తగ్గించేందుకు భారీ యాక్షన్ ప్లాన్ తో రంగంలోకి దిగుతోంది.

Read more : Petrol Prices Today : పెట్రోల్, డీజిల్ ధరలు పైపైకి.. ఒకే నెలలో ఏడోసారి..!

దేశంలో పెట్రోల్, డీజిల్ ధర లీటరుకు రూ .100 దాటింది. పెట్రోల్ రూ.110కి చేరింది. దీంతో ప్రభుత్వం పెట్రోల్-డీజిల్‌పై ఆధారపడడాన్ని ఏ విధంగానైనా తగ్గించడానికి ప్రయత్నిస్తోంది. వచ్చే ఆరు నుంచి ఎనిమిది నెలల్లో యూరో -6 ఉద్గార ప్రమాణాల ప్రకారం ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజిన్‌లను ఉత్పత్తి చేయాలని అన్ని వాహన తయారీదారులను ప్రభుత్వం కోరుతుందని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఫ్లెక్స్-ఇంధనం లేదా ఫ్లెక్సిబుల్ ఇంధనం అనేది గ్యాసోలిన్ , మిథనాల్ లేదా ఇథనాల్ కలయికతో తయారు చేయబడిన ప్రత్యామ్నాయ ఇంధనం. ఒక ఈవెంట్‌ లో పాల్గొన్న మంత్రి గడ్కరీ మాట్లాడుతు..వచ్చే 15 ఏళ్లలో భారత ఆటో పరిశ్రమ రూ .15 లక్షల కోట్లకు పెరుగుతుందని..వాహన తయారీదారులందరూ ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజిన్‌లను నిర్మించడం తప్పనిసరి అయిన తర్వాత వాహనాల ధర పెరగదని..రాబోయే రోజుల్లో భారతదేశం గ్రీన్ హైడ్రోజన్‌ను ఎగుమతి చేయగలదని మంత్రి వెల్లడించారు.

ఫ్లెక్స్ ఇంజిన్ ఒక రకమైన ఇంధన మిక్స్ సెన్సార్‌ను ఉపయోగిస్తుంది. అంటే ఇంధన బ్లెండర్ సెన్సార్. ఇది మిశ్రమంలో ఇంధనం మొత్తం ప్రకారం తనను తాను సర్దుబాటు చేస్తుంది. ఆయా వాహనాలను డ్రైవింగ్ ప్రారంభించినప్పుడు ఈ సెన్సార్లు ఇథనాల్, మిథనాల్ , గ్యాసోలిన్ నిష్పత్తిని లేదా ఇంధనంలో ఆల్కహాల్ గాఢతను గ్రహిస్తాయి. ఇది ఎలక్ట్రానిక్ కంట్రోల్ మాడ్యూల్‌కు సిగ్నల్ పంపుతుంది. ఈ కంట్రోల్ మాడ్యూల్ తర్వాత వివిధ ఇంధనాల డెలివరీని నియంత్రిస్తుంది.ఫ్లెక్స్ ఇంజిన్ వాహనాలు ద్వి-ఇంధన ఇంజిన్ వాహనాలకు చాలా భిన్నంగా ఉంటాయి. ద్వి-ఇంధన ఇంజిన్ ప్రత్యేక ట్యాంకులను కలిగి ఉంటుంది, అయితే ఫ్లెక్స్ ఇంధన ఇంజిన్‌లో మీరు ఒక ట్యాంక్‌లో వివిధ రకాల ఇంధనాలను ఉంచవచ్చు. ఇటువంటి ఇంజన్లు ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. నితిన్ గడ్కరీ అలాంటి ఇంజిన్‌లను వాహనాలలో ఇన్‌స్టాల్ చేయడం గురించి మాట్లాడుతున్నారు.

Read more : Petrol Prices Today : పెట్రోల్, డీజిల్ ధరలు పైపైకి.. ఒకే నెలలో ఏడోసారి..!

ఈ ఇంజిన్ ఉన్న వాహనాలు డిజైన్ చేయడానికి పెట్రోల్-డీజిల్ అవసరం లేదు. థనాల్ ధర లీటరుకు 60-62 రూపాయలు ఉంటుందని..ఇది ఫ్లెక్స్ ఇంజిన్ వాహనాలపై నడుస్తుందని మంత్రి గడ్కరీ గతంలో కూడా ఓసారి వెల్లడించారు. దీంతో ప్రజలు డీజిల్‌తో పోల్చుకుంటే లీటరుకు రూ. 30 నుండి 40 వరకు ఆదా చేయవచ్చు.2003లో పెట్రోల్‌తో ఇథనాల్ బ్లెండింగ్ కోసం భారతదేశం తన కార్యక్రమాన్ని ప్రారంభించిందని, 2007 లో దీనిని 5 శాతానికి తప్పనిసరి చేసినట్లు గడ్కరీ హైలైట్ చేసారు. 2018 నుండి, ఇథనాల్ ఉత్పత్తికి ఉపయోగించే ఫీడ్‌స్టాక్ ఆధారంగా ప్రభుత్వం ఇథనాల్ కోసం Multiple prices నిర్ణయిస్తున్నామని మంత్రి గడ్కరీ తెలిపారు.