ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్… 144మంది సేఫ్

  • Published By: vamsi ,Published On : September 28, 2019 / 07:57 AM IST
ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్… 144మంది సేఫ్

చండీఘడ్- ముంబై ఇండిగో విమానం ఇంజనులో సాంకేతిక లోపం కారణంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. విమాన పైలెట్ ముంబై విమానాశ్రయంలో శుక్రవారం రాత్రి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయగా.. ప్రయాణికులుతో సహా విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.

చండీఘడ్ నుంచి 144 మంది ప్రయాణికులతో కూడిన ఇండిగో ఎయిర్‌బస్ 320 విమానం ఒక ఇంజనులో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో ముందే అలర్ట్ అయ్యిన పైలెట్ ముంబై విమానాశ్రయంలో విమానంను అత్యవసర ల్యాండింగ్ చేశారు. పైలెట్ ముంబై విమానాశ్రయం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో మాట్లాడి ముందుజాగ్రత్త చర్యగా ఎమర్జన్సీ ల్యాండింగ్ చేశారు.

ఇటీవల ఇండిగో విమాన ఇంజన్లు వైబ్రేషన్ అయినా పైలెట్లు, ఇంజినీర్లు చెప్పలేదని పౌర విమానయాన శాఖ డైరెక్టరు జనరల్ ముగ్గరు ఇండిగో పైలెట్లు, ఇద్దరు ఇంజినీర్లను సస్పెండ్ చేశారు. ఈ క్రమంలోనే ఇండిగో విమానంలో ఒకటవ నంబరు ఇంజన్ లోపం ఉందనే అనుమానంతో పైలెట్ ముందుజాగ్రత్త చర్యగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారని ఇండిగో అధికార ప్రతినిధి వెల్లడించారు.