కూటమిలో చిచ్చు: కాబోయే పీఎం అఖిలేష్ 

  • Published By: chvmurthy ,Published On : January 25, 2019 / 11:11 AM IST
కూటమిలో చిచ్చు: కాబోయే పీఎం అఖిలేష్ 

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పుకోసం ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా ఇటు కేసీఆర్, వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్ధితుల్లోను కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు  నాయుడు నేతత్వంలో బీజేపీ యేతర పక్షాలతో మరో కూటమి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతుంటే, వచ్చే ఎన్నికల్లో కాబేయే కొత్త  ప్రధాని అఖిలేష్ అంటూ ఉత్తర ప్రదేశ్ లో పోస్టర్లు వెలిశాయి. బీఎస్పీ అధినేత్రి మాయావతి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు పలు పార్టీల అధినేతలు ఇప్పటికే తాము ప్రధానమంత్రి పదవికి రేసులో ఉన్నట్లు అవకాశం ఉన్నప్పుడల్లా చెప్పుకుంటున్నారు.
దేశంలో అత్యధిక లోక్ సభ స్ధానాలున్న ఉత్తర ప్రదేశ్ లో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) కూటమిగా ఏర్పడి వచ్చే లోక్ సభ ఎన్నికల్లో చెరో 38 స్థానాల్లో పోటీచేయాలని నిర్ణయించుకున్నాయి. ఉత్తర ప్రదేశ్ లో లేటెస్ట్ గా భావి భారత ప్రధాని అఖిలేష్ యాదవ్ అంటూ పలు ప్రాంతాల్లో పోస్టర్లు, హోర్డింగ్స్ ఏర్పాటు చేయడంతో కూటమిలో ఆసక్తికర చర్చ మొదలైంది. లక్నోలోని పలు ప్రదేశాల్లో ఎస్పీ పార్టీ  కార్యకర్తలు వీటిని ఏర్పాటు చేశారు. సమాజ్ వాదీ పార్టీ  ప్రధాన కార్యాలయం ముందు ఏర్పాటు చేయడంతో పాటు అఖిలేష్ కొత్తగా నిర్మించుకుంటున్న నివాసం వద్ద  హోర్డింగ్స్  వెలిశాయి.”అఖిలేష్‌పై మేమంతా ఎంతో నమ్మకంతో ఉన్నాం. దేశానికి కొత్త ప్రధాని రావాల్సిన అవసరం ఉందని” బ్యానర్లపై ప్రింట్  చేయించారు. పోస్టర్‌పై యూపీ మాజీ ముఖ్యమంత్రి , అఖిలేష్ తండ్రి ములాయం సింగ్ యాదవ్ ఫొటో కూడా ఉంది.