18 Feet Gold Ganesh : 18 అడుగుల బంగారు గణపయ్య .. ఎక్కడంటే..

వినాయక చవితి పండుగ వస్తోంది. విభిన్నమైన ఆకృతులతో బొజ్జ గణపయ్యలు కొలువుతీరనున్నారు. దీంట్లో భాగంగానే యూపీలో 18 అడుగుల పొడువులో గోల్డెన్ గణేషుడి విగ్రహాన్ని తయారు చేస్తున్నారు నిర్వాహకులు. 18 అడుగుల విగ్రహానికి మొత్తం బంగారంతో వివిధ రకాల ఆకృతులను తాపడంగా చేస్తున్నారు. తిరుమల శ్రీవారి తరహాలో బంగారు ఆభరణాలను అలంకరిస్తున్నారు.

18 Feet Gold Ganesh  : 18 అడుగుల బంగారు గణపయ్య .. ఎక్కడంటే..

18 feet Gold Ganesh In UP

18 feet Gold Ganesh In UP : దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకునే వినాయక చవితికి ఏర్పాట్లు చక చకా జరుగుతున్నాయి.. ఊరూవాడా గణేష్‌ మండపాలు సిద్ధమవుతున్నాయి. అయితే ఈసారి యూపీలోని చందౌసీలో తయారవుతున్న గణపతి దేశంలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు. స్వర్ణకాంతులీనుతూ భక్తులకు దర్శనమివ్వనున్నాడు.
ఆగస్టు 31 నుంచి ఊరూవాడా, ఇంటింటా పది రోజుల పాటు వైభవంగా పూజలందుకోనున్నాడు బొజ్జ గణపయ్య. పండుగ దగ్గరపడటంతో రంగు రంగుల గణేషుడి విగ్రహాలు ఊరూరా సందడి చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఒక్కోచోట ఒక్కో విధంగా, ఒక్క రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నాడు విఘ్నేశుడు. అయితే యూపీ చందౌసీలో రూపుదిద్దుకుంటున్న గోల్డెన్ గణపతి మాత్రం స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలవనున్నాడు…

తిరుపతి బాలాజీ స్టైల్‌లో 18 అడుగుల గోల్డెన్ గణేషుడి విగ్రహాన్ని తయారు చేస్తున్నారు నిర్వాహకులు. 18 అడుగుల విగ్రహానికి మొత్తం బంగారంతో వివిధ రకాల ఆకృతులను తాపడంగా చేస్తున్నారు. తిరుమల శ్రీవారి తరహాలో బంగారు ఆభరణాలను అలంకరిస్తున్నారు. బంగారు గణపయ్య విగ్రహం తయారీ ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయని.. చవితి రోజు నాటికి ప్రతిమ పూర్తవుతుందని చెబుతున్నారు నిర్వాహకులు. 18 అడుగుల గోల్డెన్‌ వినాయకుడి వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది..

మరోవైపు ముంబైలో అత్యంత సంపన్న గణేష్‌ మండపాన్ని ఏర్పాటు చేస్తోంది సరస్వత్‌ బ్రాహ్మిణ్‌ సేవా మండల్‌. ముంబై కింగ్ సర్కిల్ ఏరియాలో ఏర్పాటు చేస్తున్న ఈ మండపానికి ఏకంగా 316.40 కోట్లకు బీమా చేశారు. ఈ ఇన్సూరెన్స్ కవరేజ్‌.. గణేషుడి మండపానికి, విగ్రహానికి, జువెలరీకి, వాలంటీర్లకు, వర్కర్లకు, పండ్లు, కూరగాయలు, గ్రాసరీ, ఫర్నీచర్‌కు వర్తించనుంది. గణేశ్ విగ్రహాన్ని స్వర్ణాభరాలు, ఇతర విలువైన ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించనున్నారు. మహా గణపతిని ఈసారి 66 కేజీలకు పైగా బంగారపు ఆభరణాలు, 295 కేజీల వెండి ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులతో అలంకరిస్తున్నట్టు జీఎస్‌బీ సేవా మండల్ తెలిపింది.