ఎక్కడో తెలుసా : మసీదుల్లో గణేషుడు పూజలు

  • Published By: veegamteam ,Published On : August 31, 2019 / 05:07 AM IST
ఎక్కడో తెలుసా : మసీదుల్లో గణేషుడు పూజలు

మసీదుల్లో వినాయక చవితి ఉత్సవాలు. వినటానికి ఇది నమ్మశక్యంగా ఉండదు. కానీ ఎన్నో ఏళ్లనుంచి ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ..మతసామరస్యాన్ని ప్రతీకలు నిలుస్తున్నాయి భారత్ దేశంలోని పలు ప్రాంతాలు. మహారాష్ట్ర సాంగ్లీ జిల్లాలోని గొట్లీ మసీదులో ప్రతీ వినాయక చవితి పండుగకూ గణేషుకు కొలువుదీరతాడు.హిందూ-ముస్లింలు కలిసి మెలిసి  గణేశోత్సవాన్ని జరుపుకుంటారు. 

సాంగ్లీ జిల్లాలోని వాల్వా తహసీల్ లోని బారావెయ్యిలోకావస్తి గ్రామం గోట్ఖిండ్. ఈ గ్రామంలో అన్ని మతాల ప్రజలు కలిసి ప్రతి మతం యొక్క పండుగను జరుపుకుంటారు. ముస్లింలు హిందువుల పండుగలలో చేరితే, హిందువులు ముస్లిం పండుగలలో ఉత్సాహంగా పాల్గొంటారు. ఈ ఉత్సవాల్లో అధికారులు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. లోకావస్తి గ్రామంలోనే కాదు మహారాష్ట్రలోని కొన్ని పట్టణాలు,గ్రామాల ప్రజలు దేశానికే ఆదర్శంగా నిలుస్తు..మతసామరాస్యానికి భారతీయులు.. నిలువెత్తు నిదర్శనమని చాటి చెప్తున్నారు. ముస్లీంలు, హిందువులు కలిసి మెలిసి మసీదుల్లో గణేష్ మండపాల్ని ఏర్పాటు చేస్తారు.

మహారాష్ట్రలోని కొల్హాపూర్ , సాంగ్లీ జిల్లా సరిహద్దులోని పలు పట్టణాల మసీదుల్లో కూడా గణపతి మండపాల్ని ఏర్పాటు చేస్తారు. వైభవంగా వినాయక చవితి వేడుకల్ని హిందూ ముస్లీం కలిసికట్టుగా నిర్వహిస్తారు. 38 సంవత్సరాల నుంచి మసీదుల్లో కూడా గణపతి విగ్రహాల్ని ఏర్పాటు చేసి సంబరాలు నిర్వహిస్తున్నారు. ముస్లీం సోదరులు, హిందువులు కలిసికట్టుగా  పండగల్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటున్నారు. బైరగదార్, కార్‌ఖానా పరి. షొల్కె, దెపన్‌పూర్, కుడెఖానాపీర్ మసీదుల్లో కొలువుదీరిన గణపతిని భక్తులు ఆరాధిస్తారు.

పోలీసులు సైతం ఇక్కడ జరిగే వేడుకల్ని ఎంతో ఆస్వాదిస్తారు. ప్రశాంతంగా తమ విధుల్ని నిర్వహిస్తారు. ఏదీ ఏమైనా భారతదేశానికికే గర్వకారణంగా, మతసామారస్యానికి ప్రతీకగా నిలిచి ఈ పట్టణాలు… మరెన్నో గ్రామాలకు, నగరాలకు ఆదర్శం కావాలని ఆశిద్దాం. ప్రతీచోట హిందు,ముస్లీంల మధ్య ఇలాంటి స్నేహపూర్వక వాతావరణం ఏర్పడాలని ప్రతీ ఒకరూ కోరుకుందాం.

భారతదేశం  భిన్న మతాలు, భిన్న జాతులు.. భిన్న కులాల కలయిక. హిందూ ముస్లిం భాయీ..భాయీ..నినాదం ప్రతీ విషయంలో ప్రతిఫలిస్తుంటుంది. ఒకరినొకరు గౌవవించుకోవటం..ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని వారి ప్రేమాభిమానాలకు చాటు కుంటుంటారు. ఒకరి పండుగలకు మరొకరు పిలుచుకుంటారు.కలిసి మెలిసి వేడుకలు చేసుకుంటారు. భారత్ లోని పలు ప్రాంతాల్లో మసీదులు..హిందూ దేవాలయాలు పక్కపక్కనే ఉండటం భారత్ లో మత సామర్యసానికి ప్రతీకలు నిలుస్తున్నాయి.