Gang Rape: బహిర్బూమికి వెళ్లిన మహిళపై అత్యాచారం

బహిర్బూమికి వెళ్లిన మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కొందరు దుర్మార్గులు. ఘటన బీహార్ రాష్ట్రం సమస్తిపూర్ లోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మహిళ మంగళవారం సాయంత్రం ఊరు చివరకు బహిర్బూమికి వెళ్ళింది. ఆమెను గమనించిన కొందరు దుండగులు అపహరించి కొద్దీ దూరంలో ఉన్న అడవుల్లోకి తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.

Gang Rape: బహిర్బూమికి వెళ్లిన మహిళపై అత్యాచారం

Rang Rape

Gang Rape: బహిర్బూమికి వెళ్లిన మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కొందరు దుర్మార్గులు.  బీహార్ రాష్ట్రం సమస్తిపూర్ లోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మహిళ మంగళవారం సాయంత్రం ఊరు చివరకు బహిర్బూమికి వెళ్ళింది. ఆమెను గమనించిన కొందరు దుండగులు అపహరించి కొద్దీ దూరంలో ఉన్న అడవుల్లోకి తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.

అనంతరం ఆమెను హత్యచెయ్యాలనే ఉద్దేశంతో దాడి చేశారు. దాడిలో మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. అత్యాచారం చేసిన ప్రాంతం నుంచి కొద్దీ దూరం లాక్కొచ్చి అక్కడ ఓ చెట్టుకు వేలాడదీసి అక్కడి నుంచి పారిపోయారు. అటుగా వచ్చిన స్థానికులు చెట్టుకు వేలాడుతున్న మహిళను గమనించి గ్రామస్తులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న గ్రామస్తులు ఆమెను కిందకు దించారు. సదరు మహిళ అపస్మారక స్థితిలో ఉండటంతో తనపై జరిగిన ఘరాన్ని చెప్పలేకపోయింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మహిళను ఆసుపత్రికి తరలించారు. అత్యాచారానికి పాల్పడిన వారిలో ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు బాధితురాలి ఇంట్లో తాజాగా జరిగిన పెళ్ళికి టెంట్ సప్లయ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. మరికొందరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఐదు బృందాలుగా ఏర్పడి పరారీలో ఉన్నవారికోసం గాలింపు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.