Ganga Dolphin : గంగా డాల్ఫిన్స్ కోసం..బిహార్‌లో నిలిచిపోయిన గంగా రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ పనులు
బీహార్‌లో గంగా రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్‌ని.. అక్కడి అధికారులు అడ్డుకున్నారు. అయినా.. అభివృద్ధి జరుగుతుంటే.. అధికారులే అడ్డుకోవడమేంటనే సందేహం మీకు రావొచ్చు. కానీ.. దాని వెనుక ఓ రీజన్ ఉంది. రివర్ ఫ్రంట్‌లో భాగంగా నిర్మాణాలు చేపడితే.. నష్టమేమీ లేదు. కానీ.. ఓ జాతే అంతరించిపోయే ప్రమాదముంది. అదేంటో తెలుసుకుందాం..

Stopped Ganga Riverfront Project in Bihar.. : బీహార్‌లో గంగా రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్‌ని.. అక్కడి అధికారులు అడ్డుకున్నారు. అయినా.. అభివృద్ధి జరుగుతుంటే.. అధికారులే అడ్డుకోవడమేంటనే సందేహం మీకు రావొచ్చు. అది సహజం. కానీ.. దాని వెనుక ఓ రీజన్ ఉంది. అది వింటే.. వాళ్లు చేసింది నిజమే అంటారు. రివర్ ఫ్రంట్‌లో భాగంగా నిర్మాణాలు చేపడితే.. నష్టమేమీ లేదు. కానీ.. ఓ జాతే అంతరించిపోయే ప్రమాదముంది. అదేంటో తెలుసుకుందాం..
గంగా నది పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో భాగంగా.. గంగా రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్‌ని చేపట్టారు. అయితే.. దీనికి సంబంధించిన పనులను.. బీహార్‌లో అక్కడి అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. వన్యప్రాణుల అభయారణ్య చట్టాన్ని ఉల్లంఘించారన్న కారణంతో.. పనులను ఆపేశారు. ఇందుకు.. గంగా నదిలో ఉన్న డాల్ఫిన్సే అసలు కారణం. మన దేశంలో దాదాపుగా 3 వేల గంగా డాల్ఫిన్స్ ఉంటే.. అందులో సగం బీహార్లోనే ఉన్నాయ్. అవి కూడా క్రమంగా అంతరించిపోతున్నాయ్. అందువల్ల.. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. గంగా డాల్ఫిన్ల జీవితాలకు ముప్పు పొంచి ఉన్నందున.. గంగా రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనులకు.. మరికొన్ని అనుమతులు కావాల్సి ఉంటుంది.
Also read : Madhya pradesh : భోపాల్‌లో రైల్వే కూలీల కోసం ఏసీ రెస్ట్ రూమ్స్
భాగల్పూర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల్లో.. విక్రమశిల గంగా డాల్ఫిన్ అభయారణ్యంలో.. రివర్ ఫ్రంట్ నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ కింద.. గంగా నది, ఎన్‌హెచ్ 80 మధ్య.. 613 ఎకరాలను అభివృద్ధి చేయడమే ముఖ్య ఉద్దేశ్యం. అయితే.. ఈ అడవి గంగా నది వెంబడి 50 కిలోమీటర్ల దాకా విస్తరించి ఉంది. ఈ ప్రాంతం.. అంతరించిపోతున్న డాల్ఫిన్లకు సేఫ్ ప్లేస్ గానూ కొనసాగుతోంది. పైగా.. పర్యావరణంగానూ.. ఇదెంతో సున్నితమైన ప్రదేశమని చెబుతుంటారు. అందువల్ల.. గంగా డాల్ఫిన్ల సంరక్షణ, అంతేకాదు.. గంగా తీరం వెంబడి.. 2 వందల మీటర్లలోపు భవనాలు నిర్మించడాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిషేధించింది. బిహార్‌లో అధికారులు తిరిగి పనిని ప్రారంభించాలంటే.. సరైన అనుమతులు, నో అబ్జెక్షన్ పత్రాలు పొందవలసి ఉంటుంది.
గంగా డాల్ఫిన్స్.. భారత్‌తో పాటు నేపాల్, బంగ్లాదేశ్‌లోని గంగా-బ్రహ్మపుత్ర-మేఘన, కర్ణపులి-సంగు నదీ వ్యవస్థల్లో నివసిస్తున్నాయ్. వాటికి కళ్లు కూడా కనిపించవని చెబుతున్నారు. అవి కేవలం.. మంచి నీళ్లలో మాత్రమే జీవించగలవు. అందుకే.. వాటికి గంగా నదే సురక్షిత ప్రదేశమని చెబుతున్నారు. వన్యప్రాణి సంరక్ష చట్టం 1972 ప్రకారం.. గంగా నది డాల్ఫిన్‌ని.. చంపడం నేరంగా పరిగణిస్తారు. భారత ప్రభుత్వం కూడా గంగా డాల్ఫిన్‌కు.. జాతీయ జలచర జంతువుగా గుర్తించింది. ఇవి.. మొత్తం నదికి సంబంధించిన పర్యావరణ వ్యవస్థ, ఆరోగ్యానికి నమ్మకమైన సూచీగా నిలుస్తున్నాయ్.
Also read : Jyaotiraditya Scindia: అలాంటి ఘటనలను సహించేది లేదు: ఇండిగో విమాన సిబ్బంది చర్యలకు ఆదేశించిన కేంద్ర మంత్రి
ఈ గంగా డాల్ఫిన్స్.. అల్ట్రాసోనిక్ సౌండ్స్‌ని రిలీజ్ చేసి.. తమ ఆహారాన్ని వేటాడతాయి. ఇవి కొన్నిసార్లు వాటంతటవే.. వేటగాళ్ల బారిన పడి.. చేపలు పట్టే వలల్లో చిక్కుకొని సాధారణ చేపలను తినేందుకు ప్రయత్నిస్తాయి. అయితే.. రోజురోజుకు పెరుగుతున్న పొల్యూషన్.. డ్యామ్ ల నిర్మాణం కూడా డాల్ఫిన్‌పై ప్రతికూల ప్రభావం చూపుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 2020లో అంతరించిపోతున్న జాతుల జనాభాను పెంచేందుకు.. ప్రాజెక్ట్ డాల్ఫిన్ ప్రారంభించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం.. విక్రమశిల గంగా డాల్ఫన్ శాంక్చువరీ బిహార్‌లో స్థాపించారు. అలాంటి వాటికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా.. అధికారులు ముందే రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనులను ఆపేశారు.
- Road Accident : బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం..8 మంది రాజస్థాన్ కూలీలు మృతి
- Bihar : మూడు ఎకరాల భూమి కేసు..108 ఏళ్ల తర్వాత తీర్పు ఇచ్చిన కోర్టు !
- Bihar : మహిళతో ఎమ్మెల్యే డ్యాన్సులు..సీరియస్ అయిన సీఎం
- Father Rape Daughter : దారుణం.. కూతురిపై తండ్రి అత్యాచారం.. సోషల్ మీడియాలో వీడియో
- Prashant Kishor: బిహార్ ఇంకా వెనుకబడిన రాష్ట్రమే: పీకే
1Kannada songs: కన్నడ పాటలకు డాన్స్.. పెళ్లి బృందంపై దాడి
2Uttar Pradesh : అనుమానం పెనుభూతం-77 ఏళ్ల వయస్సులో భార్యను హత్య చేసిన భర్త
3Nani: ‘అంటే.. సుందరానికీ’ ట్రైలర్ అప్డేట్ అప్పుడేనట!
4Bank Charges: ఎస్బీఐ హోమ్‌లోన్ రేటు పెంపు, వాహన ఇన్సూరెన్స్‌లో పెరుగుదల: జూన్‌లో కీలక మార్పులు
5Ukraine: డాన్‌బాస్‌లో రష్యా బలగాలను అడ్డుకుంటున్నాం: ఉక్రెయిన్
6IACS Integrated Programs : ఐఏసీఎస్ లో ఇంటిగ్రేటెడ్ ప్రొగ్రామ్ ల్లో ప్రవేశాలు
7WhatsApp iPad Version : గుడ్‌న్యూస్.. ఐప్యాడ్ యూజర్ల కోసం కొత్త వాట్సాప్ వచ్చేస్తోంది..!
8Gujarat : 8 ఏళ్ల పాలనలో గాంధీజీ, పటేల్ కలల సాకారానికి కృషి చేశాం : ప్రధాని మోడీ
9SBI JOBS : ఎస్ బీ ఐ లో ప్రమోషన్ విభాగంలో ఉద్యోగాల భర్తీ
10Facebook love: ఫేస్బుక్ ప్రేమ.. పెళ్లి కొడుకు ఇజ్జత్ మొత్తం పోయింది..
-
Infinix Note 12 : ఇండియాలో ఈరోజు నుంచే Infinix Note 12 ఫోన్ సేల్.. ధర ఎంతంటే.
-
Fire Broke Out : గ్రీన్ బావర్చి హోటల్ లో అగ్నిప్రమాదం..బిల్డింగ్ లో చిక్కుకున్న 20 మంది!
-
Texas School Shooter : అందుకు కారణాలున్నాయి.. నా కుమారుడుని క్షమించండి.. టెక్సాస్ షూటర్ తల్లి ఆవేదన!
-
Union Home Ministry : డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌కు క్లీన్చిట్..సమీర్ వాంఖడేపై చర్యలకు కేంద్రం ఆదేశాలు
-
Southwest Monsoon : కేరళ వైపు పయనిస్తున్న నైరుతి రుతుపవనాలు
-
Cyber Criminals : లోన్ ఇప్పిస్తామని రూ.40,000 కాజేసిన సైబర్ నేరగాళ్లు
-
Jalli Keerthi : ఐఏఎస్ సేవకు అందరూ ఫిదా..వరదల్లో సర్వం కోల్పోయినవారికి అండగా తెలంగాణ ఆడబిడ్డ
-
TRS : ఎన్టీఆర్‌కు ఘనంగా టీఆర్ఎస్ నివాళి..!