Atiq Ahmed: హై టెన్షన్, ప్రాణ భయం మధ్య ఎట్టకేలకు యూపీ చేరుకున్న గ్యాంగ్‭స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్

కోర్టు ఇచ్చే ఎలాంటి తీర్పునైనా స్వాగతిస్తామని అతీక్ సోదరి ఆయేషా నూరీ అన్నారు. కేవలం ఆయన ప్రాణలమీదే తమకు ఆందోళనా ఉందని వెల్లడించారు. అతీక్‭ను తీసుకెళ్తున్న వాహణ శ్రేణిని ఆమె గుజరాత్ నుంచి అనుసరిస్తున్నారు. 45 మంది పోలీసు బృందంతో కాన్వాయ్ అతీక్‭ను యూపీకి తరలించింది. 25 గంటల ప్రయాణం అనంతరం ఈరోజు సాయంత్రం ప్ర‌యాగ్‌రాజ్‌ చేరుకున్నారు.

Atiq Ahmed: హై టెన్షన్, ప్రాణ భయం మధ్య ఎట్టకేలకు యూపీ చేరుకున్న గ్యాంగ్‭స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్

Gangster Atiq Ahmed reached UP

Atiq Ahmed: వందకు పైగా క్రిమినల్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్యాంగ్‭స్టర్, సమాజ్‭వాదీ పార్టీ మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్ చేరుకున్నారు. ఆయనను ప్రయాగ్‭రాజ్‭లోని జైలుకు తరలించారు. గుజరాత్ జైలులో ఉన్న ఆయనను ఓ కిడ్నాప్ కేసులో ఈ నెల 28న ప్రయాగ్‭రాజ్‭లోని న్యాయస్థానం ముందు హాజరు కావాల్సి ఉండగా యూపీ పోలీసులు స్వయంగా వచ్చి తీసుకెళ్లారు. అయితే తనను ఫేక్ ఎన్‭కౌంటర్ పేరుతో చంపేస్తారని అతీక్ ఆందోళన వ్యక్తం చేశారు. గుజరాత్ జైలు నుంచి బయటికి రావడానికి నిరాకరించారు.

Israel: న్యాయవ్యవస్థలో మార్పులకు పూనకున్న ప్రభుత్వం.. ప్రధానికి వ్యతిరేకంగా మిన్నంటిన లక్షలాది మంది నిరసన

కోర్టులో హాజరు పరిచే నెపంతో తనను తీసుకెళ్తున్నారని, తనను చంపేస్తారని గుజరాత్ జైలు నుంచి బయటికి వస్తున్న సమయంలో మీడియా ముందు అతీక్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆ సమయంలో హత్య, హత్య అంటూ భయంతో కేకలు వేశారు. మీడియా ఈ విషయాన్ని హైలైట్ చేయడంతో తరలింపులో టెన్షన్ పెరిగింది. అయితే తరలింపులో భాగంగా వాహనం ప్రమాదానికి గురికావడం గమనార్హం. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదు. ఒక మూగజీవికి మాత్రం గాయం తగిలిందట.

Chinna Jeeyar: తిరుచానూరు పద్మావతి అమ్మవారి సేవలో త్రిదండి చిన్న జీయర్ స్వామి

కొద్ది రోజుల క్రితమే వికాశ్ దూబే అనే ఒక గ్యాంగ్‭స్టర్‭ను ఇలాగే తరలిస్తుండగా రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అది జరిగింది యూపీలోనే. దీంతో అతీక్ తరలింపుపై మరింత ఉత్కంఠ నెలకొంది. 2019 జూన్ నుంచి స‌బ‌ర్మ‌తి సెంట్ర‌ల్ జైలులో అతీక్ శిక్ష అనుభ‌విస్తున్నారు. రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి మోహిత్ జైశ్వాల్ కిడ్నాప్‌, దాడి కేసులో అత‌న్ని ప్ర‌యాగ్‌రాజ్‌ జైలుకు త‌ర‌లించారు. ఇక తాజాగా ఉమేశ్ పాల్ మ‌ర్డ‌ర్ కేసు కూడా అతీక్ మీద న‌మోదు అయ్యింది.

MLA Anil Kumar Yadav : మీరు మళ్లీ గెలిస్తే రాజకీయాలు వదిలేస్తా- ఆ ముగ్గురికి ఎమ్మెల్యే అనిల్ సవాల్

కాగా, కోర్టు ఇచ్చే ఎలాంటి తీర్పునైనా స్వాగతిస్తామని అతీక్ సోదరి ఆయేషా నూరీ అన్నారు. కేవలం ఆయన ప్రాణలమీదే తమకు ఆందోళనా ఉందని వెల్లడించారు. అతీక్‭ను తీసుకెళ్తున్న వాహణ శ్రేణిని ఆమె గుజరాత్ నుంచి అనుసరిస్తున్నారు. 45 మంది పోలీసు బృందంతో కాన్వాయ్ అతీక్‭ను యూపీకి తరలించింది. 25 గంటల ప్రయాణం అనంతరం ఈరోజు సాయంత్రం ప్ర‌యాగ్‌రాజ్‌ చేరుకున్నారు.