Gautam Adani : అప్పులభారంలో ఆదానీ కంపెనీలు..సంచలనంగా మారిన క్రెడిట్‌సైట్స్‌ రిపోర్టు..

ఒకదానికి ఒకటి సంబంధం లేని గ్రూప్‌ల్లో పెట్టుబడులు పెడుతున్న అదానీ గ్రూప్‌.. తన మార్క్ ఏంటో బిజినెస్ వర్గాలకు పరిచయం చేస్తోంది. ఇక్కడివరకు అంతా బానే ఉంది. మరి వ్యాపారాల కోసం కావాల్సిన డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది.. అప్పుల మీదే ఎక్కువగా ఆధారపడుతోందా..? ఇది ఇలానే కొనసాగితే దివాళా తీయక తప్పదా..? అసలు అప్పుల మీద ఇంతటి సామ్రాజ్యం నిలబడుతుందా? అది సాధ్యమేనా.. ?ఇంతకీ ఆ రిపోర్టులో ఏముంది..?

Gautam Adani : అప్పులభారంలో ఆదానీ కంపెనీలు..సంచలనంగా మారిన క్రెడిట్‌సైట్స్‌ రిపోర్టు..

Gautam Adani

Gautam Adani : ఒకదానికి ఒకటి సంబంధం లేని గ్రూప్‌ల్లో పెట్టుబడులు పెడుతున్న అదానీ గ్రూప్‌.. తన మార్క్ ఏంటో బిజినెస్ వర్గాలకు పరిచయం చేస్తోంది. ఇక్కడివరకు అంతా బానే ఉంది. మరి వ్యాపారాల కోసం కావాల్సిన డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది.. అప్పుల మీదే ఎక్కువగా ఆధారపడుతోందా..? ఇది ఇలానే కొనసాగితే దివాళా తీయక తప్పదా..? అసలు అప్పుల మీద ఇంతటి సామ్రాజ్యం నిలబడుతుందా? అది సాధ్యమేనా.. ?ఇంతకీ ఆ రిపోర్టులో ఏముంది..?

ఎన్డీటీవీ విషయంలో అదానీ గ్రూప్ స్ట్రాటజీలపై బిజినెస్‌వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుండగానే.. ఫిచ్‌ అనే సంస్థకు చెందిన క్రెడిట్‌సైట్స్‌ ఇచ్చిన రిపోర్టు ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. అదానీ గ్రూప్‌ తీవ్రమైన అప్పులభారంలో ఉందని.. ప్రజెంట్ వ్యాపారాలతో పాటు కొత్తగా ఏర్పాటు చేయబోయే వాటికి కూడా పెట్టుబడుల కోసం రుణాలనే ఎక్కువగా ఉపయోగించబోతోందని క్రెడిట్‌సైట్స్ తన నివేదికలో తెలిపింది అదానీ గ్రూప్‌.. డీప్లీ ఓవర్‌ లివరేజ్డ్‌ పేరుతో రిపోర్టులో బయటపెట్టిన విషయాలు సంచలనంగా మారాయ్. అద్వానీ గ్రూప్‌నకు గడ్డు పరిస్థితులు ఎదురైతే.. ఆసంస్థ తీవ్ర అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరించింది. అదే జరిగితే.. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ గ్రూప్‌ కంపెనీలు ఎగవేతలకు పాల్పడే చాన్స్ ఉందని రిపోర్టులో వివరించింది.

దాదాపు 40 ఏళ్ల కింద కమోడిటీస్ ట్రేడింగ్‌తో అదానీ వ్యాపారం మొదలైంది. ఆ తర్వాత గనులు, పోర్టులు, పవర్ ప్లాంట్లు, ఎయిర్‌పోర్టులు, డేటా సెంటర్లు, డిఫెన్స్.. ఇప్పుడు మీడియా రంగంలోకి కూడా అదానీ గ్రూప్‌ విస్తరించింది. ఒకదానితో ఒకటి సంబంధం లేని వ్యాపారాల్లో అదానీ గ్రూప్ అడుగు పెడుతూనే ఉంది. వ్యాపార విస్తరణపై ఆ సంస్థ దూకుడు చూపిస్తోంది. దీంతో కంపెనీ క్రెడిట్​మెట్రిక్స్ అంటే రుణ పరిమితులు… క్యాష్ ఫ్లోపై ఎఫెక్ట్ పడుతోందని క్రెడిట్​సైట్స్​అంటోంది. తనకు పరిచయం లేని… సంబంధం లేని రంగాల్లోకి అదానీ గ్రూప్​ఎంటర్ అవుతోందని.. ఐతే ఈ బిజినెస్‌లు అన్నీ డబ్బు చాలా ఎక్కువ మొత్తంలో అవసరమైనవేనని… కొత్త బిజినెస్‌ల ల ఎగ్జిక్యూషన్‌లో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా సమస్యగా మారే ఛాన్స్​ఉంటుదని తన రిపోర్టులో వివరించింది.

Also read : Gautam Adani : అన్నింటా ఆదానీయే .. వంటనూనెల నుంచి విద్యుత్‌ వరకూ .. పోర్టుల నుంచి మీడియా రంగం వరకు…

అదానీ గ్రూప్‌లోని ఆరు కంపెనీలు స్టాక్‌ఎక్స్చేంజీలో లిస్ట్ అయ్యాయ్. గ్రూప్‌లోని కొన్ని కంపెనీలు.. డాలర్​బాండ్స్​అప్పులను తీర్చాల్సి ఉంది. ఈ ఆరు లిస్టెడ్​కంపెనీలకూ కలిపి 2022 ఆర్థిక సంవత్సరం చివరినాటికి.. 2వేల 309 బిలియన్లు… అంటే దాదాపు 2లక్షల 30వేల 9వందల కోట్ల అప్పులు ఉన్నాయ్. చేతిలోని క్యాష్‌ను మినహాయించి లెక్కేసినా.. నికర అప్పులు వెయ్యి 729 బిలియన్లు అంటే లక్షా 72వేల 9వందల కోట్లు ఉంటాయ్. ఇప్పటికే ఉన్న వ్యాపారాలలో పెట్టుబడులతో పాటు… కొత్త రంగాల్లోకి అడుగు పెట్టడానికీ… డబ్బును ప్రధానంగా అప్పుల రూపంలోనే అదానీ గ్రూప్ సమీకరిస్తోంది. ఇదే ఫ్యూచర్‌లో సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉందని క్రెడిట్‌ సైట్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఇండియాలో వ్యాపారం అంటే ఒకప్పుడు టాటాల పేర్లు.. ఆ తర్వాత అంబానీల పేర్లు వినిపించాయ్. వీళ్లద్దరిని పక్కకు నెట్టి ఇప్పుడు అదానీ గ్రూప్ అతిపెద్ద కార్పొరేట్‌ గ్రూప్‌గా నిలిచింది. ఐతే అదానీ గ్రూప్ అప్పులపై చాలామంది క్లయింట్లు, ఇన్వెస్టర్లు ఆందోళనతో ఉన్నారని క్రెడిట్‌సైట్స్ సంస్థ చెప్తోంది. తమకు ఏ మాత్రం అనుభవం లేని కాపర్​రిఫైనింగ్​, పెట్రో కెమికల్స్​, టెలికాం, అల్యూమినియం ప్రొడక్షన్​రంగాల్లోకి అదానీ ఎంటర్‌ కావడమే ఆందోళనకు కారణమని అంటోంది. ఈ రంగాల్లోని కంపెనీలు.. తీసుకున్న అప్పులను వెంటనే తీర్చడానికి తగినంత లాభాలను సంపాదించలేవు. లాభాలు ఆ వ్యాపారాలలో వెంటనే రావు. దీంతో మొదట్లో రీ ఫైనాన్సింగ్​మీదే ఆధారపడాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు డబ్బు సమకూర్చుకోవాలంటే బ్యాంకింగ్​ సంబంధాలు పటిష్టంగా ఉండాలి. ఏమైనా ఇలా మితిమీరి అప్పులు చేయడంతో గ్రూప్‌లోని ఏదైనా ఒకటి లేదా ఎక్కువ కంపెనీలు డిఫాల్ట్​అయ్యే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తోంది.

ప్రస్తుతం స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్ అయిన ఆరు కంపెనీలకు అదానీనే చైర్మన్‌గా ఉన్నారు. ఒకదానికొకటి సంబంధం లేని రంగాల్లో పెట్టుబడులు పెడుతూ.. తన దూకుడు చూపిస్తున్నారు. ఐతే గ్రూప్‌లో ఆయన లేకపోతే పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. బోర్డులో ఎవరిలోనూ ఆస్థాయిలో మేనేజ్‌మెంట్‌ సామర్థ్యం లేదు అన్నది మరికొందరి అభిప్రాయం. పదేళ్లలో గ్రూప్ పగ్గాలు వేరేవాళ్లకు అప్పజెప్పాల్సి వస్తుంది. మరి అప్పుడు పరిస్థితి ఏంటన్నది మరో అనుమానం. ఇలాంటి సమయంలో క్రెడిట్‌సైట్స్ రిపోర్టు మరింత టెన్షన్‌ పెడుతోంది. ఈ రిపోర్టుతో అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు కూడా డీలా పడ్డాయ్‌. వ్యాపార రంగంలో ఒక్కోసారి దూకుడే.. విజయసూత్రం అవ్వొచ్చు. కానీ, అన్ని సార్లు మాత్రం కాదు. కొద్దిపాటి అప్పు ఉందంటేనే మనకు నిద్ర పట్టదు. ఆ అప్పు ఎలా తీర్చాలన్న భయం వెంటాడుతూనే ఉంటుంది. అలాంటిది.. లక్షల కోట్ల అప్పులు చేస్తూ.. వాటిని తీర్చకుండానే మరికొన్ని కంపెనీలను కొనడానికి.. లాక్కోవడానికి మళ్లీ అప్పుల్నే అదానీ నమ్ముకోవడం ఆందోళన కలిగిస్తోంది. అప్పుల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేయకపోతే మాత్రం అదానీ సామ్రాజానికే ముప్పు తప్పదన్న అభిప్రాయం