Gautam Adani: ప్రపంచ బిలియనీర్ల జాబితాలో టాప్-10 నుంచి గౌతమ్ అదానీ ఔట్ ..
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక ప్రభావంతో భారతీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ వ్యాపార సామ్రాజ్యం కుదేలవుతోంది. గత నాలుగు రోజులుగా అదానీ గ్రూప్ షేర్లు భారీగా పడిపోతున్నాయి. దీంతో బ్లూమ్‌బెర్గ్ ప్రపంచ బిలియనీర్స్ జాబితాలో టాప్ -10 నుంచి గౌతమ్ అదానీ ఔట్ అయ్యాడు. ప్రస్తుతం అదానీ 84.4 బిలియన్ డాలర్లతో 11వ స్థానంలో ఉన్నారు.

Gaitam Adani
Gautam Adani: హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక ప్రభావంతో భారతీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ వ్యాపార సామ్రాజ్యం కుదేలవుతోంది. గత నాలుగు రోజులుగా అదానీ గ్రూప్ షేర్లు భారీగా పడిపోతున్నాయి. అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్ ధరలు భారీగా పడిపోయాయి. మంగళవారంసైతం అదానీ గ్రూప్ షేర్ల విలువ పతనమయ్యాయి. దీంతో భారీగా నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. గత మూడు ట్రేడింగ్ సెషన్లలో అదానీ సంపద 34 బిలియన్ డాలర్లు ఆవిరైపోయింది. దీంతో బ్లూమ్‌బెర్గ్ ప్రపంచ బిలియనీర్స్ జాబితాలో టాప్ -10 నుంచి అదానీ ఔట్ అయ్యాడు. ప్రస్తుతం అదానీ 84.4 బిలియన్ డాలర్లతో 11వ స్థానంలో ఉన్నారు.
Gautam Adani : భారీగా పడిపోయిన అదానీ గ్రూప్ షేర్లు.. ప్రపంచ కుబేరుల జాబితాలో ఏడో స్థానంకు అదానీ..
అదానీ గ్రూప్ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని, ఖాతాల్లోనూ మోసాలకు పాల్పడుతుందని ఆరోపిస్తూ అమెరికాకు చెందిన ప్రముఖ పెట్టుబడుల పరిశోధక సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంచలన నివేదిక విడుదల చేసింది. ఈ నివేదికతో స్టాక్ మార్కెట్లలో షేర్లన్నీఒడుదొడుకులకు గురయ్యాయి. అదానీ గ్రూప్ కు సంబంధించిన షేర్లు భారీగా పతనమయ్యాయి. అయితే, హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదిక అబద్దమని, తమ గ్రూప్ సంస్థల్లో ఎలాంటి అవకతవకలు లేవని గౌతమ్ అదానీ పేర్కొన్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. దీంతో అదానీ షేర్లు మూడు రోజుల్లో 68 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ ఆవిరైపోయింది.
మంగళవారం కూడా హిండెన్ బర్గ్ రీసెర్చి నివేదిక ప్రభావంతో మార్కెట్లలో భయం నెలకొంది. మంగళవారం 12గంటల సమయంలో అదానీ టోటల్ గ్యాస్ షేరు 10శాతం విలువ కోల్పోయింది. దీంతో పాటు అదానీ విల్మర్ 5శాతం, అదానీ పవర్ లిమిటెడ్ 4.9 శాతం పతనం అయ్యాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ 0.6శాతం కుంగింది. దీంతో ప్రస్తుతం ప్రపంచ బిలియనీర్ల జాబితాలో అదానీ 84.4 బిలియన్ డాలర్లతో 11వ స్థానంలో ఉన్నారు. ఆయన తర్వాతి స్థానంలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కొనసాగుతున్నారు. ముఖేష్ అంబానీ ఆస్తుల విలువ 82.2 మిలియన్ డాలర్లు.