Gautam Adani: వారెన్ బఫెట్‌ను దాటిన అదానీ.. ప్రపంచ కుబేరుల్లో ఐదో స్థానం

గతంలో టాప్ పొజిషన్‌కు కూడా చేరుకున్న వారెన్ బఫెట్, ఇప్పటివరకు ఐదో స్థానంలో ఉండగా.. తాజాగా గౌతమ్ అదానీ ఆయన స్థానాన్ని ఆక్రమించాడు.

Gautam Adani: వారెన్ బఫెట్‌ను దాటిన అదానీ.. ప్రపంచ కుబేరుల్లో ఐదో స్థానం

Gautam Adani

Gautam Adani: ప్రముఖ భారతీయ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ సంపదలో దూసుకెళ్తున్నారు. ప్రపంచ కుబేరుల జాబితాలో వారెన్ బఫెట్‌ను దాటి ఐదో స్థానానికి చేరుకున్నారు. గతంలో టాప్ పొజిషన్‌కు కూడా చేరుకున్న వారెన్ బఫెట్, ఇప్పటివరకు ఐదో స్థానంలో ఉండగా.. తాజాగా గౌతమ్ అదానీ ఆయన స్థానాన్ని ఆక్రమించాడు. అదానీకి ఇండియాతోపాటు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో బడా వ్యాపారాలున్నాయి. పోర్టులు, ఎయిర్ పోర్టులు, ఎలక్ట్రిసిటీ, గ్రీన్ ఎనర్జీ, ట్రాన్స్‌పోర్ట్ వంటి అనేక వ్యాపారాలను అదానీ నిర్వహిస్తున్నారు.

Gautam Adani : 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లో గౌతమ్ అదానీ.. ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్ తర్వాతే ఈయనే..!

ఫోర్బ్స్ తాజాగా ప్రకటించిన కుబేరుల జాబితాలో అదానీ ఐదో స్థానంలో ఉండగా, ఆయన సంపద 123.2 బిలియన్ డాలర్లుగా ఉంది. వారెన్ బఫెట్ సంపద 121.7 బిలియన్ డాలర్లు. ఫోర్బ్స్ జాబితాలో స్పేస్ ఎక్స్, టెస్లా అధినేత ఎలన్ మస్క్ 269.7 బిలియన్ డాలర్ల సంపదతో అగ్రస్థానంలో ఉన్నాడు. తర్వాత అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ 170.2 బిలియన్ డాలర్ల సంపదతో రెండో స్థానంలో, ఎల్వీఎమ్‌హెచ్ అధినేత బెర్నార్డ్ అర్నాల్ట్ 166.8 బిలియన్ డాలర్ల సంపదతో మూడో స్థానంలో, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ 130.2 బిలియన్ డాలర్ల సంపదతో నాలుగో స్థానంలో ఉన్నారు.