దంపతులుగా గుర్తించమని కోరుతూ..కోర్టుకు మొరపెట్టుకున్న ‘గే’ జంట

  • Published By: nagamani ,Published On : October 9, 2020 / 11:46 AM IST
దంపతులుగా గుర్తించమని కోరుతూ..కోర్టుకు మొరపెట్టుకున్న ‘గే’ జంట

Delhi high court Guy couple pitition : గే, ట్రాన్స్‌జెండర్స్, లెస్బియన్స్, బై సెక్సువల్స్ పట్ల నేటికీ సమాజంలో చులకన భావం కొనసాగుతోంది. కానీ ఇప్పుడిప్పుడే సమాజం వీరి పట్ల మార్పుచెందుతోంది. వారుకూడా ఈ సమాజంలో భాగస్వాములే అనే ఆలోచన వస్తోంది. కానీ ఎక్కువశాతం మంది మాత్రం వారిపట్ల చులకన భావం చూపిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో వారి పట్ల వివక్ష ఉంది. టువంటివారికి ఇళ్లు కూడా అద్దెకు ఇవ్వని పరిస్థితి ఉంది. వారిని కన్నవారే వెలేస్తున్న దుస్థితి ఉంది.


కానీ మాకు కూడా ఓ తోడు కావాలని ఆకాంక్షించే గే, ట్రాన్స్‌జెండర్స్, లెస్బియన్స్, బై సెక్సువల్స్ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అలా ఇద్దరు గేలు వివాహం చేసుకున్నారు. కానీ సమాజం నుంచి వారిపట్ల వివక్షను ఎదుర్కుంటున్నారు.




దీంతో ఆ గే జంట ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ‘‘మమ్మల్ని దంపతులుగా గుర్తించండి అని కోరుతున్నారు. అమెరికాలో పెళ్లి చేసుకున్న సదరు పురుష జంట తమ వివాహానికి ఫారిన్ మ్యారేజ్ యాక్ట్, 1969 ప్రకారం తమకు ఇక్కడ గుర్తింపు ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటీషనర్లలో ఒకరు భారతీయ పౌరుడు..మరొకరు భారత దేశపు ఓవర్సీస్ పౌరుడు.


2017లో తామిద్దరం అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో పెళ్ళి చేసుకున్నామని సదరు గే జంట కోర్టుకు వివరించారు. 2020 మార్చి 5న తమ వివాహం రిజిస్ట్రేషన్ కోసం న్యూయార్క్‌లోని ఇండియన్ కాన్సులేట్‌ను సంప్రదించామని పిటీషన్ లో తెలిపారు. అయితే తమ సెక్సువల్ ధోరణి కారణంగా తమ అప్లికేషన్ ను తిరస్కరించారని హైకోర్టుకు మొరపెట్టుకున్నారు.


తమ దరఖాస్తును తిరస్కరించడం భారత రాజ్యాంగంలోని అధికరణలు 14, 15, 19, 21లను ఉల్లంఘించడమేనని ఆ జంట ఆరోపించింది. నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కు భారత రాజ్యాంగంలోని అధికరణ 21లో ఉందని సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో ఈ విషయాన్ని వెల్లడించింద హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కాగా, జస్టిస్ నవీన్ చావ్లా ధర్మాసనం ముందుకు గురువారం (అక్టోబర్ 8,2020)ఈ పిటిషన్ రాగా.. దానిని వేరొక ధర్మాసనానికి నివేదించగా ఈ పిటీషన్ పై వచ్చే వారం విచారణ జరుగనుంది.