Tributes : పార్థీవ దేహాలకు కుటుంబసభ్యుల నివాళి..శ్రద్ధాంజలి ఘటించిన దోవల్,రాజ్ నాథ్

తమిళనాడులోని కూనూర్ వద్ద బుధవారం హెలికాప్టర్​ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్​ జనరల్​ దంపతులు సహా 11 మంది సైనికుల పార్థివ దేహాలను ఢిల్లీలోని పాలెం ఎయిర్​ బేస్​కు తీసుకొచ్చారు.

Tributes : పార్థీవ దేహాలకు కుటుంబసభ్యుల నివాళి..శ్రద్ధాంజలి ఘటించిన దోవల్,రాజ్ నాథ్

Raj

Tributes తమిళనాడులోని కూనూర్ వద్ద బుధవారం హెలికాప్టర్​ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్​ జనరల్​ దంపతులు సహా 11 మంది సైనికుల పార్థివ దేహాలను ఢిల్లీలోని పాలెం ఎయిర్​ బేస్​కు తీసుకొచ్చారు. సూలూరు ఎయిర్‌ బేస్‌ నుంచి C-130J ఎయిర్‌క్రాప్ట్‌ భౌతికకాయాలతో గురువారం మధ్యాహ్నం బయలుదేరి.. సాయంత్రానికి చేరుకుంది. ఎయిర్​బేస్​కు చేరుకున్న అమరుల కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. తమ వారికి శ్రద్ధాంజలి ఘటించారు.

జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోవల్.. పాలెం ఎయిర్​బేస్​కు చేరుకుని సీడీఎస్​ జనరల్​ బిపిన్​ రావత్​ దంపతులు సహా 11 మంది సైనికుల పార్థివదేహాలకు నివాళులర్పించారు అమరుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​.. పాలెం ఎయిర్​బేస్​కు చేరుకుని శ్రద్ధాంజలి ఘటించారు. అమరుల కుటుంబాలతో మాట్లాడి.. ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అంతకుముందు బిపిన్‌ రావత్‌ కుటుంబ సభ్యుల్ని ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి పరామర్శించారు. ఢిల్లీలోని వారి నివాసానికి వెళ్లి తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. రావత్ మరణం దేశానికి, మరీ ముఖ్యంగా ఉత్తరాఖండ్‌కు తీరని లోటన్నారు. ఆ నష్టం ఎవరూ పూడ్చలేనిదన్నారు.

ALSO READ Bodies Identification : రావత్ దంపతులు,మరొకరు తప్ప..గుర్తించలేని స్థితిలో 10 మృతదేహాలు!