India-Germany: భారత పర్యటనలో పుతిన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన జర్మన్ నేవీ చీఫ్

ఉక్రెయిన్ భూభాగాన్ని రష్యా ఆక్రమించుకోవాలని చూస్తుందంటూ వచ్చిన వార్తలపై జర్మన్ నేవీ చీఫ్ కే-అచిమ్ షాన్‌బాచ్ స్పందిస్తూ.. అవి అర్ధంలేని మాటలుగా కొట్టిపారేశారు.

India-Germany: భారత పర్యటనలో పుతిన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన జర్మన్ నేవీ చీఫ్

India Russia

India-Germany-Russia: జర్మనీ నేవీ చీఫ్ “కే-అచిమ్ షాన్‌బాచ్”.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై “అసాధారణ రీతిలో అనుకూల వ్యాఖ్యలు” చేశారు. భారత్ – జర్మనీ దేశాల నావికాదళాల మధ్య పరస్పర సహకారాలను మరింత బలపరుచుకునేందుకు న్యూ ఢిల్లీ చేరుకున్న జర్మన్ నేవీ చీఫ్ “కే-అచిమ్ షాన్‌బాచ్”..శుక్రవారం ఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ ఎనాలిసిస్ (IDSA)లో చర్చాగోష్ఠిలో పాల్గొన్నారు. భారత నేవీ అడ్మిరల్ R హరి కుమార్ సహా జాతీయ అంతర్జాతీయ మీడియా ప్రతినిధులతో షాన్‌బాచ్ చర్చలో పాల్గొన్నారు. ఈసమావేశానికి సంబందించిన వీడియోలను IDSA తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసింది.

Also read: India-Germany: భారత పర్యటనకు వచ్చి చైనా పై నిప్పులు చెరిగిన జర్మన్ అధికారి

చర్చా సమయంలో చైనాపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన షాన్‌బాచ్, ఉక్రెయిన్ విషయంలో రష్యాను వ్యక్తిగతంగా వెనకేసుకొచ్చారు. ఉక్రెయిన్ ను వశపరుచుకోవాలన్న ఉద్దేశం రష్యాకు గానీ, ఆ దేశాధ్యక్షుడు పుతిన్ కు గానీ ఉన్నట్లు తాను భావించడం లేదని షాన్‌బాచ్ వివరించారు. పుతిన్ కేవలం వారి దేశ గౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నం మాత్రమే చేస్తున్నారని షాన్‌బాచ్ అభిప్రాయపడ్డారు. భారత పర్యటనలో ఉన్న షాన్‌బాచ్ ఇప్పుడు ఈవ్యాఖ్యలు చేయడం యూరోప్ లోని మిగతా దేశాల్లో గుబులు పుట్టిస్తుంది. ప్రపంచ యుద్ధాల(1, 2) అనంతరం రష్యాతో యూరోపియన్ యూనియన్ దేశాల బంధాలు అంటీఅంటకుండా ఉన్న నేపథ్యంలో జర్మన్ అధికారి ఈవ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Also read: Afghanistan – India: అతి త్వరలో భారత్ నుంచి పాక్ మీదుగా ఆఫ్ఘన్‌కు చేరనున్న గోధుమలు

ఉక్రెయిన్ భూభాగాన్ని రష్యా ఆక్రమించుకోవాలని చూస్తుందంటూ వచ్చిన వార్తలపై స్పందిస్తూ.. అవి అర్ధంలేని మాటలుగా కొట్టిపారేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద(వైశాల్యం పరంగా) దేశమైన రష్యాకు..చిన్న భూభాగాన్ని ఆక్రమించుకోవాల్సిన అవసరం లేదన్న షాన్‌బాచ్..అందుకోసం పుతిన్ యుద్ధం చేసేవరకు వెళ్తారని తాను అనుకోవడంలేదని తెలిపారు. ఉక్రెయిన్, రష్యా దేశాల గౌరవాన్ని కాపాడేందుకు పెద్దన్నగా పుతిన్ ఆ బాధ్యత తీసుకున్నట్లు షాన్‌బాచ్ వర్ణించారు. ఉక్రెయిన్ విషయంలో పుతిన్ బహుశా తనపై తానే ఒత్తిడి తెచుకుంటున్నాడని, ఒక వేళా ఉక్రెయిన్ ను ఆక్రమించి యూరోపియన్ యూనియన్ ను విడదీయాలనుకున్నా.. పుతిన్ కు అది సాధ్యమేనని ఆ విషయం పుతిన్ కి కూడా తెలుసని షాన్‌బాచ్ పేర్కొన్నారు.

Also read: Bose Statue: తెలంగాణ గ్రానైట్ రాయితో సుభాష్ చంద్రబోస్ విగ్రహం తయారు

ఇంత చేసి పుతిన్ నిజంగా కోరుకునేది గౌరవం కోసమేనని ..గౌరవం ఇచ్చేందుకు ఏమంత ఖర్చుకూడా కాదుగదా అంటూ షాన్‌బాచ్ వ్యాఖ్యానించారు. యూరోపియన్ యూనియన్ దేశాల సరసన రష్యాను నిలిపి గౌరవించాలన్న షాన్‌బాచ్.. అందుకు రష్యా నూటికినూరు శాతం “అర్హమైందని” అభివర్ణించారు. ఆమాటకొస్తే.. ప్రపంచ దేశాలు పెద్దన్నగా భావిస్తున్న అమెరికా సరసన రష్యాను కూడా చేర్చి గౌరవించాలని, తద్వారా చైనా నుంచి రష్యాను దూరం చేయొచ్చని కే-అచిమ్ షాన్‌బాచ్ అభిప్రాయపడ్డారు. రష్యాలోని వనరులపై ఆధారపడ్డ చైనాను రష్యా నుంచి వేరుచేయడం ద్వారా ఏకాకిని చేయవచ్చని, తద్వారా చైనాకు గుణపాఠం చెప్పినట్టు ఉంటుందని పేర్కొన్నారు. ఇంత పెద్ద(రష్యా) దేశం ప్రజాస్వామ్యం పై ఆధారపడనప్పటికీ.. రష్యా ఎంతో ముఖ్యమైన జాతిగా పేర్కొన్నారు. భారత్, జర్మనీ దేశాలకు రష్యా ఎంత అవసరమో, చైనాకు చెక్ పెట్టేందుకు ప్రపంచానికి రష్యా అంతే అవసరమని షాన్‌బాచ్ వివరించారు.

Also read: Crime News: లిఫ్ట్ లో అనుమానాస్పద స్థితిలో పనిమనిషి మృతి