Indane Gas : కేవలం ఒక్క మిస్డ్ కాల్ తో గ్యాస్ కనెక్షన్ పొందండి

ఇకపై గ్యాస్ కనెక్షన్ పొందాలి అంటే ఒక మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది. ఈ సరికొత్త విధానానికి ఇండియన్ గ్యాస్ శ్రీకారం చుట్టింది. 8454955555 నెంబర్ కి మిస్డ్ కాల్ ఇస్తే గ్యాస్ కొత్త కనెక్షన్ తోపాటు, బుకింగ్ కు వీలు కల్పించింది.

Indane Gas : కేవలం ఒక్క మిస్డ్ కాల్ తో గ్యాస్ కనెక్షన్ పొందండి

Indane Gas

Indane Gas : గతంలో కొత్త గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలంటే చాలా సమయం పట్టేది. ఐదారు సార్లు గ్యాస్ ఏజెన్సీ కార్యాలయం చుట్టూ తిరిగితే కానీ గ్యాస్ కనెక్షన్ రాకపోయేది. ఐతే ఇప్పుడు పరిస్థితులు మారాయి.. అంతలా తిరిగే ఓపిక వెయిట్ చేసే సమయం ఎవరికి లేదు. ఉదయం బుక్ చేశామా అంటే సాయంత్రం వరకు గ్యాస్ ఇంటి ముందు ఉండాలి.. పది రూపాయలు ఎక్కువైనా పర్లేదు కానీ పని మాత్రం వెంటనే జరిగిపోవాలి అనే ధోరణికి వచ్చారు ప్రజలు.

గ్యాస్ ఏజెన్సీలు కూడా వినియోగదారుల అభిరుచిని అర్ధం చేసుకొని మార్పులు చేర్పులు చేస్తూ వస్తున్నాయి. ఇంతకూ కొత్త గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలి అంటే ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లి క్యూలో నిలబడాల్సి వచ్చేది. అయితే ఇకపై అలాంటి సమస్యలేమీ ఉండవని ఇండేన్ ఆయిల్ కార్పొరేషన్ పేర్కొంది. గ్యాస్ బుకింగ్, కొత్త గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలి అనుకునే వారికోసం ఇండేన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండేన్ గ్యాస్ కనెక్షన్ ని కేవలం ఒక్క మిస్డ్ కాల్ తో తీసుకునే అవకాశాన్ని కల్పించింది.

దీనిని ట్విట్టర్ వేదికగా పంచుకోవడం జరిగింది. 8454955555 నంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా సింపుల్ గా గ్యాస్ కనెక్షన్ పొందవచ్చని.. అదే విధంగా గ్యాస్ ని కూడా బుక్ చేసుకోవచ్చు అని తెలిపింది. ఎవరైనా కొత్త సిలిండర్ బుక్ చెయ్యాలంటే రిజిస్టర్ మొబైల్ నంబర్ నుంచి ఈ 8454955555 నెంబర్ కి కేవలం మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది. ఈ సర్వీసు దేశంలో ఎక్కడైనా సరే పొందొచ్చు అని తెలిపారు. ఐదుకేజిల సిలిండర్లుని కూడా వినియోగదారులు తీసుకోవచ్చని తెలిపింది.

కాగా ఎక్కువ కుటుంబాలు 14.5 సిలిండర్లనే వాడుతుంటాయి. చిన్న ఫ్యామిలీలకు.. ఇరుకు గదుల్లో ఉండేవారికి ఈ ఐదు కేజీల సిలిండర్ బాగా ఉపయుక్తంగా ఉంటుంది.