Assam Police : మూడు నెలల్లో ఫిట్‌ అవ్వండీ లేదంటే వీఆర్ఎస్ తీసుకుని ఇంటికెళ్లండీ : పోలీసులకు వార్నింగ్

పోలీసులంటే ‘ఫిట్’గా ఉండాలి ‘పొట్ట’లేసుకుని ఉండకూడదు. పోలీసులు ‘ఫిట్’గా ఉండాలంటే ఏం చేయాలో చెబుతోంది ప్రభుత్వం.లేదంటే ఇక ఉద్యోగం నుంచి ఊస్టింగేనంటోంది.

Assam Police : మూడు నెలల్లో ఫిట్‌ అవ్వండీ  లేదంటే వీఆర్ఎస్ తీసుకుని ఇంటికెళ్లండీ  : పోలీసులకు వార్నింగ్

Assam Police fitness

fitness Assam Police : పోలీసులంటే ‘ఫిట్’గా ఉండాలి ‘పొట్ట’లేసుకుని ఉండకూడదు. అందుకని అస్సాం ప్రభుత్వం పోలీసులు ‘ఫిట్’గా ఉండటానికి ఓ వినూత్న కార్యక్రమం చేపట్టింది. అంతేకాదు ‘ఫిట్’గా ఉండకపోతే ‘ఊస్టింగ్’అంటూ థమ్కీ కూడా ఇచ్చింది. మూడు నెలల్లో ఫిట్ గా అవ్వండీ లేకపోతే వీఆర్ఎస్ ఇచ్చేస్తాం అంటూ హెచ్చరించింది. దీంతో అస్సాం పోలీసులు ‘ఫిట్’నెస్ కోసం పాకులాడుతున్నారు. అంటే కొవ్వు కరిగించుకునే పనిలో పడ్డారు.

ఐపీఎస్‌లతోసహా పోలీసులందరూ బాడీని ఫిట్‌గా మార్చుకోవాలని సూచించింది. బీఎంఐ (BMI)(Body mass index)ని లెక్కగట్టి బరువు తగ్గకపోతే వీఆర్ఎస్ ఇచ్చి ఇంటికి పంపేస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చింది. బరువు తగ్గనివారికి మరో మూడు నెలలు అవకాశం కూడా ఇస్తుంది. అప్పటికి BMIలో తేడా రాకుంటే ఇక ఊస్టింగ్ తప్పదు. అంటే స్వచ్ఛంద పదవీ విరమణ (VRS) ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీనికి సంబంధించి అస్సాం డీజీపీ జీపీ సింగ్‌ ఓ ట్వీట్‌ చేశారు.

Assam govt : మద్యానికి బానిసలైన పోలీసులకు బలవంతపు వీఆర్ఎస్ .. కానిస్టేబుల్స్ నుంచి అధికారుల వరకు ఉద్యోగాలు ఊస్టింగ్

‘సీఎం ఆదేశాలను బట్టి ఐపీఎస్‌, ఏపీఎస్‌ (అస్సాం పోలీస్‌ సర్వీస్‌) అధికారులతోసహా అన్ని విభాగాలకు చెందిన పోలీసుల బాడీ మాస్ ఇండెక్స్ (BMI) నమోదు చేయాలని నిర్ణయించాం. ఆగస్టు 15 వరకు అందరికి మూడు నెలల సమయం ఇచ్చి.. ఆ తర్వాత బీఎంఐ లెక్కచూస్తాం. ఊబకాయం (BMI 30+) కేటగిరీలో ఉన్న వారందరికీ బరువు తగ్గించుకునేందుకు మరో మూడు నెలల గడువు ఇస్తాం. అప్పటికీ ఫిట్‌గా మారకపోతే.. థైరాయిడ్‌ సమస్య తదితర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మినహా మిగతా వారికి స్వచ్ఛంద పదవీ విరమణ ఆప్షన్‌ ఇస్తాం. అస్సాం డీజీపీనే ఆగస్టు 16న మొదటగా బీఎంఐ లెక్కింపునకు హాజరవుతారు’ అని ట్వీట్ లో పేర్కొన్నారు.

అస్సాంలో దాదాపు 70 వేల మంది పోలీసు సిబ్బంది ఉన్నారు. మద్యానికి బానిసలుగా మారిన, ఊబకాయంతో బాధపడుతున్నవారిని, విధులకు అనర్హులుగా తేలిన 680 మందికిపైగా సిబ్బంది లిస్టుని రూపొందించింది. వీరిని పూర్తి స్థాయి సమీక్ష తరువాత వారికి వీఆర్‌ఎస్‌ ఆప్షన్‌ ఇస్తామని వెల్లడించింది. సమీక్ష కోసం జిల్లాల్లో కమిటీలను ఏర్పాటు చేశామని తెలిపారు. డిప్యూటీ కమాండెంట్ లేదా ఎస్పీ ర్యాంక్ అధికారి నేతృత్వం వహిస్తారని తెలిపారు. దీంట్లో భాగంగా పోలీసులందరిని ఫిట్‌గా మార్చేందుకు ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. కానీ లిస్టులో పేర్లున్నవారు వీఆర్ఎస్ తీసుకోవటానికి ఇష్టపడకపోతే వారికి ఫీల్డ్ డ్యూటీ కేటాయించబడుతుందని అని సింగ్ తెలిపారు.