Solar Roof Scheme: 20 ఏళ్లు ఉచితంగా కరెంట్ అందించే స్కీం.. ఇలా అప్లై చేయండి

సోలార్ ప్యానెల్స్ వాడకంతో కరెంట్ ఖర్చు తగ్గడమే కాదు.. పర్యావరణానికి కూడా మేలు.

Solar Roof Scheme: 20 ఏళ్లు ఉచితంగా కరెంట్ అందించే స్కీం.. ఇలా అప్లై చేయండి

Solar Rooftop Scheme

Solar Roof : పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. అటు కరెంట్ చార్జీలు కూడా షాక్ కొడుతూనే ఉన్నాయి. దినదినం.. బ్రేకుల్లేకుండా ఈ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. మరి సామాన్యుడి జేబు ఫుల్లుగా ఉండేదెప్పుడు..? ఈ ప్రశ్నకు ఓ సమాధానంగా కనిపిస్తోంది సోలార్ రూఫ్ టాప్ స్కీమ్.

కొన్నేళ్లుగా పునరుత్పాదక విద్యుత్ శక్తి సోలార్ పవర్ ను ఎంకరేజ్ చేస్తోంది నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం. ఇందుకోసం సబ్సిడీలు కూడా ఇస్తూ… ప్రత్కక్షంగా సహాయం కూడా చేస్తోంది. సబ్సిడీతో లభించే సోలార్ రూఫ్ ను ఇంటిపైన అమర్చుకుని… ఖర్చులేకుండా కరెంట్ ఉత్పత్తి చేసుకోవచ్చు. నెలవారీ కరెంట్ బిల్లులో దాదాపు 50శాతం ఖర్చును తగ్గించుకోవచ్చు. ఇదెలాగో తెల్సుకోవడం.. ప్రభుత్వ సేవను ఉపయోగించడం ఇప్పుడు చాలా అవసరం కూడా.

Solar Rooftop Scheme 2

Solar Rooftop Scheme 2

ఇంటి పైన సోలార్ రూఫ్ టాప్ ఇన్ స్టాల్ చేసుకునేందుకు వినియోగదారులకు సబ్సిడీ ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. సోలార్ రూఫ్ టాప్ కనీసం 25 ఏళ్లపాటు ఎలక్ట్రిసిటీ అందించనుంది. ఈ స్కీమ్ కింద.. ఐదారేళ్ల పాటు నిర్వహణకయ్యే ఖర్చును ప్రభుత్వమే చెల్లించనుంది. ఆ తర్వాత 19 నుంచి 20 ఏళ్ల ఉచిత ఎలక్ట్రిసిటీ లబ్ధిని పూర్తిస్థాయిలో పొందవచ్చు.

Read Also : RGV : అల్లుఅర్జున్ ఒక్కడే సూపర్‌స్టార్.. ఆర్జీవీ సెన్సేషన్ ట్వీట్..

సోలార్ ప్యానెల్స్ ఇన్‌స్టాలేషన్ కు పెద్దగా స్పేస్ కూడా అవసరం లేదు. 10 చదరపు మీటర్ల ఏరియాలో ఏర్పాటుచేసే సోలార్ ప్యానెల్స్ తో… ఒక కిలో వాట్ సోలార్ పవర్ ను జెనరేట్ చేయొచ్చు. స్టోర్ అయిన కరెంట్ ను ఇంటి వినియోగానికి వాడుకోవచ్చు. పెద్ద స్థలంలో ఎక్కువగా పవర్ జెనరేట్ చేస్తే.. దీనిని కమర్షియల్ గానూ వాడుకోవచ్చు.
3KV సోలార్ రూఫ్ ప్లాంటేషన్ కు అయ్యే ఖర్చులో 40శాతం సబ్సిడీని… 10KV నుంచి 500KV వరకు సోలార్ రూఫ్ ప్లాంటేషన్ కు అయ్యే ఖర్చులో 20 శాతం సబ్సిడీని కేంద్రం ఇస్తోంది.
దగ్గర్లోని ఏ విద్యుత్ పంపిణీ సంస్థను సంప్రదించినా కూడా ఈ స్కీమ్ పై పూర్తి వివరాలు అందిస్తారు. లేదా.. mnre.gov.in వెబ్ సైట్ లోనూ ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి. ఈ సైట్ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు.

దీనికోసం
-solarrooftop.gov.in సైట్ కు వెళ్లండి
-హోం పేజీలో.. Apply For సోలార్ రూఫింగ్ క్లిక్ చేయండి.
– తర్వాత పేజీలో మీ రాష్ట్రం సెలెక్ట్ చేసుకోండి
-సోలార్ రూఫ్ అప్లికేషన్ వస్తుంది. ఫిల్ చేయండి.
-డీటెయిల్స్ ఇచ్చి సబ్మిట్ కొట్టండి.
టోల్ ఫ్రీ నంబర్ 1800-180-3333 కు కూడా కాల్ చేసి సహాయం పొందగలరు.

సోలార్ ప్యానెల్స్ వాడకంతో కరెంట్ ఖర్చు తగ్గడమే కాదు.. పర్యావరణానికి కూడా మేలు. గ్రూప్ గా సోలార్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తే 30 నుంచి 50శాతం వరకు కరెంట్ బిల్లులు తగ్గించుకోవచ్చని కేంద్రం చెబుతోంది.

Read Also : Vikki – Katrina : విక్కీ – కత్రినా పెళ్లి ఫుటేజ్ కోసం 100కోట్ల డీల్..!