తిక్క కుదిరింది ఎదవకి… వేధించిన యువతితోనే రాఖీ కట్టించుకోమని తీర్పు చెప్పిన జడ్జి

  • Published By: madhu ,Published On : August 3, 2020 / 08:21 AM IST
తిక్క కుదిరింది ఎదవకి… వేధించిన యువతితోనే రాఖీ కట్టించుకోమని తీర్పు చెప్పిన జడ్జి

వివాహితను వేధించిన కేసులో న్యాయమూర్తి వినూత్న తీర్పును వెలువరించారు. వేధించిన మహిళతో రాఖీ కట్టించుకోవాలి..అంతేగాకుండా..రూ. 11 వేలు ఇచ్చి..ఆమె ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని హైకోర్టు..ఇండోర్ బెంచ్ విలక్షణంగా తీర్పును వెలువరించింది.



వివరాల్లోకి వెళితే…

30 ఏళ్ల వివాహిత ఇంటికి వెళ్లి వేధించిన కేసులో ఉజ్జయినికి చెందిన విక్రమ్ బాగ్రీని అరెస్టు చేశారు. అనంతరం జైలుకు తరలించారు. దీంతో విక్రమ్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇండోర్ బెంచ్ దీనిపై విచారణ చేపట్టి..బెయిల్ మంజూరు చేసింది. కానీ షరతులు పాటిస్తేనే బెయిల్ మంజూరు చేయడం జరుగుతుందని న్యాయమూర్తి రోహిత్ ఆర్య చెప్పారు.



2020, ఆగస్టు 03వ తేదీన రక్షా బంధన్ సందర్భంగా భార్యతో కలసి స్వీటు బాక్సుతో ఆమె ఇంటికి వెళ్లాలని..అక్కడ ఆమెతో రాఖీ కట్టించుకోవాలని సూచించారు. అంతేగాకుండా..భవిష్యత్ లో ఎలాంటి ఆపద రాకుండా..చూసుకుంటనని హామీనిస్తూ…రూ. 11 వేలు ఇవ్వాలని వెల్లడించారు. ఇక ఆమె కొడుక్కి రూ. 5 వేలు ఖర్చు చేసి దుస్తులు, స్వీట్లు కొనిచ్చి..బాధితురాలి నుంచి ఆశీర్వాదం తీసుకోవాలని న్యాయమూర్తి సూచించారు.