కుక్కల్ని పెంచుకుంటే పర్స్ ఖాళీ : మున్సిపల్ కార్పొరేషన్ సంచలన నిర్ణయం

  • Published By: veegamteam ,Published On : September 17, 2019 / 04:23 AM IST
కుక్కల్ని పెంచుకుంటే పర్స్ ఖాళీ : మున్సిపల్ కార్పొరేషన్ సంచలన నిర్ణయం

ఇకపై కుక్కల్ని పెంచుకోవాలంటే మీ పర్స్ ఖాళీ అయిపోవటం ఖాయం. ఎందుకంటే కుక్కల్ని పెంచుకోవాలనుకుంటే మున్సిపల్ కార్పొరేషన్ కు రూ.5వేలు కట్టాల్సిందే. పైగా కుక్కల్ని పెంచుకోవాలంటే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పర్మిషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. 

ఇదేంటి మేమేమన్నా పులుల్ని..జింకల్ని పెంచుకుంటున్నామా? కుక్కల్ని పెంచుకుంటే మున్సిపల్ కు ఎందుకు డబ్బులు కట్టాలి అనే డౌట్ రావచ్చు..తరువాత కోపం కూడా వస్తుంది. ఎందుకంటే మనుషులకు కుక్కలకు ఉన్న అనుబంధం అంటుంటిది. కొంతమంది కుక్కల్ని స్టేటస్ కోసం పెంచుకుంటే..మరికొందరు ఇష్టంతో వాటిమీద ఉన్న ప్రేమతో పెంచుకుంటారు. ఇంటిలో మనిషిగానే వాటిని చూస్తారు. వాటి ఆరోగ్యం విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. కుక్కలు కూడా మనిషి పట్ల ఎంతో విశ్వాసాన్ని చూపిస్తాయి. ప్రేమగా చూస్తే చాలు వాటి ప్రాణాల్ని కూడా అర్పించిన ఘటనల గురించి విన్నాం. అటువంటిది కుక్కను పెంచుకుంటే మున్సిపల్ కార్పొరేషన్ కు డబ్బులు కట్టటమేంటి? అని అనుకోవటంలో తప్పులేదు. ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో నగరవాసులు షాక్ అవుతున్నారు.  

ఇప్పటి వరకూ ఒక లెక్క..ఇప్పటి నుంచీ మరో లెక్క అంటూ ఘజియాబాద్ మున్సిపల్ కార్పొరేషన్..ఇక నుంచి పెంపుడు కుక్కలు, పిల్లులను పెంచుకోవాలంటే మున్సిపాలిటీకి రూ.5వేల పన్ను చెల్లించి..పర్మిషన్ తీసుకోవాలంటోంది. పెంపుడు కుక్కలు, పిల్లులతో పాటు ఇతర జంతువులు బహిరంగంగా మల విసర్జన చేస్తే  దాన్ని ఆయా జంతువుల యజమాని శుభ్రం చేయాలని కండిషన్ కూడా పెట్టింది. అంతేకాదు వారి జంతువులు అలా చేస్తే..రూ.500 ఫైన్ కూడా మున్సిపల్ కార్పొరేషన్ కు చెల్లించాలని నిర్ణయించింది. కాగా..ఇప్పటికే ఢిల్లీ, గురుగ్రామ్ నగరాల్లో పెంపుడు జంతువుల యజమానుల నుంచి ప్రతీ సంవత్సరం రూ.500 రిజిస్ట్రేషన్ ట్యాక్స్ గా వసూలు చేస్తున్నారు.