నేరస్తుడి షర్టుపై ‘Namo again’…గాబరాపడ్డ పోలీసులు

  • Published By: nagamani ,Published On : November 2, 2020 / 12:14 PM IST
నేరస్తుడి షర్టుపై ‘Namo again’…గాబరాపడ్డ పోలీసులు

Ghaziabad thief t shirt ‘Namo again’ : దేశరాజధాని ఢిల్లీకి సమీజంలోని గజియాబాద్‌లోని లెనీ బార్డర్ వద్ద పోలీసులకు ఒక విచిత్రమైన అనుభవం ఎదురైంది. మొబైల్ షాపులో చోరీలకు పాల్పడుతున్న నలుగురు దొంగలను పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయాన్ని గజియాబాద్ పోలీసులు ట్విట్టర్‌లో షేర్ చేశారు.


ఈ పోస్ట్ చేసిన కొంతసేపటికే పోలీసులు ఆ ట్వీట్‌ను తొలగించారు. కారణమేంటంటే..పోలీసులు పట్టుకున్న దొంగల్లో ఓ దొంగ వేసుకున్న టీషర్టుపై ‘నమో అగైన్’ అని రాసుంది. ఈ ఫొటోను చూసిన యూజర్లు ఈ ట్వీట్‌ను ట్రోల్ చేయడం ప్రారంభించారు. రాజకీయాలకు ముడిపట్టి కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. ఈ పోస్ట్ పెట్టిన క్షణాల్లోనే ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. దీంతో గాబరా పడ్డ గజియామబాద్ పోలీసులు ఆ పోస్ట్ ను తొలగించారు.



కాగా..మొబైల్ షాపులో ఫోన్లు చోరీ చేసిన ఈ నలుగురు దొంగలు వాటిని ఆదివారం (నవంబర్ 1,2020) అమ్ముతుండగా పోలీసులువ వారిని పట్టుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో సౌరవ్, హ్యాపీ అకా పప్పు, సచిన్, పంకజ్ అనే దొంగలుగా పోలీసులు గుర్తించారు. వీరంతా ఢిల్లీ లోని హర్ష్ విహార్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్నారని పోలీసులు తెలిపారు.


దొంగిలించబడిన మొబైల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ముఠా గతంలో ఎక్కకెక్కడ చోరీలు చేశారు? చోరీ చేసినవాటిని ఎక్కడెక్కడ విక్రయించారు. ఇంకా చోరీలు చేసే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? అనేకోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


ఈక్రమంలో సదరు దొంగల్లో ఓ దొంగ వేసుకున్న టీషర్టు పై ‘‘నమో ఎగైన్’’అని రాసి ఉండటం వైరల్ గా మారింది. దీనిపై వివమర్శలు వస్తుండటంతో పోలీసులు ఆ పోస్ట్ ను డిలీట్ చేశారు.