BJP Calls: గులాం నబీ ఆజాద్‭కు బీజేపీ నుంచి పిలుపు

చాలా కాలం క్రితమే కాంగ్రెస్ పార్టీకి ఆజాద్ టాటా చెప్పి బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. ఆయనకు ఉపరాష్ట్రపతి పదవి ఇస్తారని కూడా ప్రచారం జరిగింది. కానీ వాస్తవంలో ఇవేవీ జరగలేదు. ఇది జరిగిన చాలా కాలానికి తాజాగా ఆయన రాజీనామా చేశారు. అయితే బీజేపీలో చేరతారనేదాని కంటే ముందు ఆయనే సొంతంగా పార్టీ పెట్టనున్నట్లు కొత్త ప్రచారం ఊపందుకుంది. ఇందు కోసమే ఆయన రాజీనామా చేశారని అంటున్నారు.

BJP Calls: గులాం నబీ ఆజాద్‭కు బీజేపీ నుంచి పిలుపు

Ghulam Nabi Azad is welcome to join us says BJP Kuldeep Bishnoi

BJP Calls: సుదీర్ఘకాలంపాటు కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధానికి గుడ్ బై చెప్పిన అనంతరం గులాం నబీ ఆజాద్‭కు బీజేపీ నుంచి పిలుపు వచ్చింది. ఆజాద్ వస్తే బీజేపీలోకి స్వాగతం పలుకుతామని ఆ పార్టీ నేత కుల్దీప్ బిష్ణోయి శుక్రవారం ప్రకటించారు. పార్టీ కోరితే తాను ఆజాద్‭తో మాట్లాడతానని, అయితే ఆజాద్ ఇష్టాయిష్టాల మేరకే సంప్రదిస్తానని ఆయన అన్నారు. ‘‘బీజేపీలోకి ఆజాద్ వస్తా అంటే స్వాగతిస్తాం. పార్టీ కోరితే ఆయనతో నేనే స్వయంగా మాట్లాడి ఒప్పిస్తాను. కాంగ్రెస్ స్వయం డిప్రెషన్‭లో ఉంది, ఆత్మహత్యకు సమీపంలో ఉంది’’ అని బిష్ణోయ్ అన్నారు. బిష్ణోయ్ గతంలో కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవారు. అయితే పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత బీజేపీలో చేరారు.

కాగా, చాలా కాలం క్రితమే కాంగ్రెస్ పార్టీకి ఆజాద్ టాటా చెప్పి బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. ఆయనకు ఉపరాష్ట్రపతి పదవి ఇస్తారని కూడా ప్రచారం జరిగింది. కానీ వాస్తవంలో ఇవేవీ జరగలేదు. ఇది జరిగిన చాలా కాలానికి తాజాగా ఆయన రాజీనామా చేశారు. అయితే బీజేపీలో చేరతారనేదాని కంటే ముందు ఆయనే సొంతంగా పార్టీ పెట్టనున్నట్లు కొత్త ప్రచారం ఊపందుకుంది. ఇందు కోసమే ఆయన రాజీనామా చేశారని అంటున్నారు. సొంత రాష్ట్రం జమ్మూ కశ్మీర్ నుంచే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు గులాం నబీ ఆజాద్ అన్నీ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Another jolt to Congress: కాంగ్రెస్ పార్టీకి మరో షాక్.. ఆజాద్‭కు మద్దతుగా మరో 5గురు రాజీనామా

జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా పని చేసిన ఆజాద్.. జాతీయ స్థాయిలో మంచి పేరు ఉన్న నేత. అయితే ఆయన జాతీయ రాజకీయాల్లోకి వస్తారా, లేదంటే జమ్మూ కశ్మీర్ వరకే పరిమితమైపోతారా అనే ప్రశ్నలు సహజంగానే వస్తున్నాయి. అయితే సొంత పార్టీపై బహిరంగ ప్రకటనేదీ చేయని ఆజాద్.. ఒక ప్రముఖ పత్రికకు చెందిన విలేకరితో మాత్రం ‘‘ప్రస్తుతం అయితే నా సొంత రాష్ట్రం జమ్మూ కశ్మీర్‭లో పార్టీ పెడతాను. జాతీయ రాజకీయాలపై తర్వాత ఆలోచిస్తాను’’ అని అన్నట్లు సమాచారం.

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో తన ఉనికిని గట్టిగా చాటుకోవాలని ఆజాద్ కోరుకుంటున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. 73 ఏళ్ల ఆజాద్‌కు జమ్మూకశ్మీర్‌లో కీలక పదవికి కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఆఫర్ ఇచ్చినప్పటికీ ఆయన నిరాకరించారు. తొమ్మిదేళ్లుగా తాను చేసిన సిఫారసులను ఏఐసీసీ ఏరోజూ పట్టించుకోలేదని ఆజాద్ శుక్రవారం తన రాజీనామా లేఖలో విమర్శలు గుప్పించారు. రాహుల్‌ అపరిపక్వ నాయకత్వాన్ని ఎండగడుతూ విమర్శలు గుప్పించారు.

జార్ఖండ్‎లో హైడ్రామా.. సీఎం హేమంత్ సోరెన్ పై అనర్హత వేటు