Telia Bhola Fish: భలే జాక్‌పాట్..!! 75కేజీల చేప రూ.36లక్షలు

పశ్చిమ బెంగాల్‌లోని సుందర్‌బాన్స్ నదుల్లో తెలియా భోళా అనే రకం 78.4కిలోల చేప కనిపించింది. 7 అడుగుల పొడవున్న చేప ఖరీదు దాదాపు రూ.36లక్షల వరకూ పలికింది. అనుకోకుండా వలలో పడి...

Telia Bhola Fish: భలే జాక్‌పాట్..!! 75కేజీల చేప రూ.36లక్షలు

Telia bola Fish

Telia Bhola Fish: పశ్చిమ బెంగాల్‌లోని సుందర్‌బాన్స్ నదుల్లో తెలియా భోళా అనే రకం 78.4కిలోల చేప కనిపించింది. 7 అడుగుల పొడవున్న చేప ఖరీదు దాదాపు రూ.36లక్షల వరకూ పలికింది. అనుకోకుండా వలలో పడిన అతిపెద్ద చేపను లాగడానికి పెద్ద గుంపు కష్టపడాల్సి వచ్చింది.

సాధారణంగా ఉండే మనుషుల ఎత్తు కంటే ఆ చేప భారీ ఎత్తులో కనిపించింది. చేప వలలో పడిందని తెలియగానే దానిని చూసేందుకు స్థానికులు గుంపులు గుంపులుగా వచ్చారు. శనివారం సాయంత్రం ఆ చేపను క్యానింగ్ మార్కెట్ కు తీసుకొచ్చి వేలం నిర్వహించారు. తొలి సారి వేలంలో అంతపెద్ద చేప కనిపించడంతో భారీ ధర పలికింది. రూ.36లక్షల 53వేల 605కు కోల్‌కతాకు చెందిన ఫిష్ ట్రేడింగ్ కంపెనీ కేఎంపీ కొనుగోలు చేసింది.

‘అంత పెద్ద చేపను మార్కెట్లో మేం ఎప్పుడూ చూడలేదు. వేలంలో కొనుగోలు చేసిన చేప ఖరీదు కేజీ రూ.47వేల 880వరకూ పలికిందని ప్రభాత్ మోండాల్ చెప్పారు.

……………………………………. : పాకిస్తాన్ కు భారీ సాయం ప్రకటించిన సౌదీ

దీనిని తెలియా భోళా అనే పేరుతో పిలుస్తారు. దానిలో చాలా ఔషద గుణాలు ఉంటాయట. జీర్ణ వ్యవస్థలో కొన్ని విలువైన వనరులు జోడించే స్వభావం కలది. విదేశీ మార్కెట్లో దీనికి భారీగా డిమాండ్ ఉండటంతో పాటు మెడిసిన్ లో వాడుతుంటారట. ఈ రకం చేపలను ఎగుమతి చేసి భారీ లాభాలు పొందుతారు.

ఇటీవల మహారాష్ట్రలోని పల్ఘార్ కు చెందిన చేపలమ్మే వ్యక్తి.. 157 ఘోల్ చేపలు పడటంతో మిలియనీర్ అయిపోయాడు. రూ.1.33కోట్లకు వాటిని అమ్మి.. రాత్రికి రాత్రే ధనవంతుడయ్యాడు. ఇండో-ఫసిఫిక్ ప్రాంతంలో కనిపించిన ఘోల్ చేప అనేది ప్రపంచంలో చాలా ఖరీదైన చేప. ఇందులో అయోడిన్, ఒమెగా-3, డీహెచ్ఏ, ఈపీఏ, ఐరన్, టారిన్, మెగ్నీషియం, ఫోరైడ్, సెలెనియం వంటి రిచ్ న్యూట్రియంట్లు పుష్కలంగా ఉంటాయి.