Gold Theft : స్నేహితుడి కోసం 750 గ్రాముల బంగారం చోరీచేసిన బాలిక

సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తి కోసం 750 గ్రాముల బంగారం చోరీ చేసింది 15ఏళ్ల బాలిక

Gold Theft : స్నేహితుడి కోసం 750 గ్రాముల బంగారం చోరీచేసిన బాలిక

Gold Theft

Gold Theft : సోషల్ మీడియా ద్వారా మేలు ఎంత ఉందొ కీడు కూడా అంతే ఉంది. సోషల్ మీడియాలో పరిచయమైన వారిలో కొందరు కేటుగాళ్లు ఉంటారు.. వారు ఎదో విధంగా మోసం చేస్తుంటారు. ప్రేమపేరుతో కొందరు మోసం చేస్తే మరికొందరు డబ్బు కాజేస్తుంటారు. తాజాగా కేరళలో ఇటువంటిదే ఓ ఘటన జరిగింది. సోషల్ మీడియా వేదికగా పరిచయమైన వ్యక్తి కోసం ఏకంగా 750 గ్రాముల బంగారం చోరీచేసింది 15 ఏళ్ల బాలిక.

Read More :   Prince Andrew : బ్రిటన్ యువరాజుపై లైంగిక వేధింపుల కేసు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరువనంతపురంకు చెందిన 15 ఏళ్ల బాలిక పదవ తరగతి చదువుతోంది. ఆమెకు సోషల్ మీడియా ద్వారా శిబిన్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. వారిమధ్య పరిచయం స్నేహంగా మారింది. ఏడాది కాలంగా వీరిద్దరి మధ్య చాటింగ్, కాల్స్ నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బాలికతో తన కుటుంబ ఆర్ధిక పరిస్థితుల గురించి చెప్పడం మొదలు పెట్టాడు శిబిన్. అతడి మాయమాటలు విన్న బాలిక ఇంట్లోని 750 గ్రాముల బంగారం దొంగిలించి అతడికి ఇచ్చింది. దీంతో శిబిన్ ఆ బంగారం అమ్మి తన ఇల్లు రిపేర్ చేయించుకున్నాడు. మిగిలిన రూ.10 లక్షలు దాచుకున్నాడు.

ఇక బంగారం కోసం బాలిక తల్లి ఇల్లంతా వెతికిన కనపడలేదు. దీంతో దొంగతనం జరిగిందని భావించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చుట్టుపక్కల సీసీటీవీలను పరిశీలించారు. వారి ఇంట్లోకి వచ్చిన వారిని విచారించారు. అనంతరం మరోసారి ఇంట్లో తనిఖీ చేసి బాలికను ప్రశ్నించారు. ఆమె తడబడుతుండటంతో మెల్లిగా ఆమె నుంచి వివరాలు సేకరించారు. పొంతన లేని సమాదానాలు చెబుతుంటడంతో బాలికే బంగారం తీసినట్లు గుర్తించి వివరాలు సేకరించారు. మొత్తం బంగారం తానే తీసి శిబిన్ కి ఇచ్చినట్లు తెలిపింది.

Read More : Star Dupes : నెట్టింట వైరల్ అవుతున్న డూప్ స్టార్స్..

శిబిన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించారు. విచారణలో తనకు 270 గ్రాముల బంగారం మాత్రమే ఇచ్చినట్లు వెల్లడించాడు. దీంతో పోలీసులు మరోసారి బాలికను విచారించారు. పాలక్కాడ్‌కు చెందిన మరో ఇన్‌స్టాగ్రామ్ స్నేహితునికి 40 గ్రాముల బంగారం ఇచ్చినట్లు వెల్లడించింది. అయితే ఇద్దరికీ ఇచ్చిన బంగారం మొత్తం కలిసి 310 గ్రాములే అవుతోంది. దొంగతనం జరిగిన బంగారం 750 గ్రాములని బాలిక తల్లి చెబుతోంది. దీంతో పోలీసులు ప్రత్యేక టీమ్ ను పిలిపించి బాలికను విచారిస్తున్నారు.

మరోవైపు పాలక్కాడ్ కు చెందిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తులకు లక్షల విలువచేసే బంగారం ఇవ్వడంతో తల్లిదండ్రులు బాలికపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ బంగారం వచ్చేలా చూడాలని పోలీసులను వేడుకుంటున్నారు.