Girl Shoot: లైంగికంగా వేధింపులు.. గ్రామ సర్పంచ్ భర్తను కాల్చి చంపిన యువతి

అనంతరం యువతిని విచారించారు. దీంతో ఆమె జరిగిన విషయం తెలిపింది. గత రెండేళ్లుగా తనను లైంగికంగా వేధిస్తున్నాడని. సహకరించకపోతే ఇంట్లో వాళ్ళని చంపుతా అని బెదిరిస్తున్నాడని.. వేధింపులు ఎక్కువ కావడంతో హత్య చేశానని తెలిపింది. దీంతో సదరు యువతి, ఆమె సోదరుడిపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు.

Girl Shoot: లైంగికంగా వేధింపులు.. గ్రామ సర్పంచ్ భర్తను కాల్చి చంపిన యువతి

Girl Shoot

Girl Shoot: లైంగికంగా వేధిస్తున్న గ్రామ సర్పంచ్ భర్తను ఓ యువతి కాల్చి చంపింది.. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని కన్నౌజ్ జిల్లా జలాల్పూర్ అమ్రా గ్రామంలో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళితే గ్రామ సర్పంచ్ భర్త రామ్‌సరన్, గ్రామానికి చెందిన ఓ 20 ఏళ్ల యువతిని గత రెండుళ్లుగా లైంగికంగా వేధిస్తున్నాడు.

అంతే కాదు ఆమెపై భౌతిక దాడికి దిగుతూ హింసిస్తున్నాడు. గత కొద్దీ రోజులుగా రామ్‌సరన్ అరాచకం ఎక్కువై పోయింది. దీంతో అతడి బాధ భరించలేని యువతి ఇంట్లో సోదరుడికి, తల్లికి చెప్పింది. ఈ నేపథ్యంలోనే ముగ్గురు కలిసి రామ్‌సరన్ హతమార్చాలని పథకం పన్నారు. పంచాయితీ చెయ్యాలంటూ ఆదివారం బాధిత యువతి సోదరుడు రామ్‌సరన్ ను ఇంటికి తీసుకొచ్చాడు. కొద్దీ సేపు అతడితో మాట్లాడాడు బాధిత యువతి సోదరుడు. ఇద్దరు మాట్లాడుతున్న సమయంలోనే యువతి రామ్‌సరన్ ను వెనక నుంచి నాటు తుపాకీతో కాల్చింది.

దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. హత్య అనంతరం యువతి, ఆమె సోదరుడు.. ఫరూఖాబాద్ కు పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు రామ్‌సరన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. యువతి హత్య చేసినట్లు నిర్దారించారు పోలీసులు. ఫరూఖాబాద్ లో ఉన్న యువతిని, ఆమె సోదరుడిని మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.