Sensational comments : అమ్మాయిలకు ఫోన్లు ఇవ్వడం వల్లే అత్యాచారాలు..కూతుళ్ల బాధ్యత తల్లులదే..

అమ్మాయిలు అతిగా ఫోన్లు వాడడం వల్లే అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయని..కాబట్టి అమ్మాయిలు ఫోన్లు ఇవ్వవద్దు అంటూ యూపీ మహిళా కమిషన్ సభ్యురాలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిలకు ఫోన్లు ఇవ్వటం వల్ల అబ్బాయిలతో గంటల తరబడి బాతాఖాలు కొడుతూ మోసపోతున్నారని వ్యాఖ్యానించారు.

Sensational comments : అమ్మాయిలకు ఫోన్లు ఇవ్వడం వల్లే అత్యాచారాలు..కూతుళ్ల బాధ్యత తల్లులదే..

Women Commission Member Sensational Comments

Women Commission member Sensational comments : మహిళలు, యువతులు, బాలిల శ్రేయస్సు కోసం ఏర్పాటై కమిషన్.. మహిళల ప్రగతికి కృషి చేయాల్సిన మహిళా కమిషన్ సభ్యులు యువతులకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు చేయటం సంచలనంగా మారాయి. ‘అమ్మాయిలకు సెల్ ఫోన్లు ఇవ్వకూడదని..వాళ్లు సెల్ ఫోన్లు ఎక్కువగా వినియోగించటవల్లే అత్యాచారాలు జరుగుతున్నాయని ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ సభ్యురాలు మీనా కుమారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిలు అతిగా ఫోన్లు వాడడం వల్లే అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయని..అవే కొంపలు ముంచుతున్నాయని..కాబట్టి అమ్మాయిలు ఫోన్లు ఇవ్వవద్దని అన్నారు.

అలీగఢ్ జిల్లాలో మహిళా ఫిర్యాదులపై విచారణల సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.‘‘అమ్మాయిలకు సెల్ ఫోన్లు అసలు ఇవ్వొద్దు. గంటలకొద్దీ అబ్బాయిలతో బాతాఖానీలు కొడుతున్నారు. ఆ తర్వాత వారితో కలిసి పారిపోతారు..తల్లిదండ్రులు వారి అమ్మాయిలు ఏం చేస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఫోన్ తో ఏమేం చేస్తున్నారు? అని పట్టించుకోవట్లేదనీ..వ్యాఖ్యానించారు. అమ్మాయిలకు సెల్ ఫోన్లు దూరం పెట్టాలని సూచించారు.

మహిళలపై పెరుగుతున్న నేరాలపై సమాజం కూడా ప్రభావం చూపిస్తోందనీ..తల్లిదండ్రులు..ముఖ్యంగా తల్లులు..తమ కుమార్తెలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం చాలా ఉందన్నారు. కుమార్తెలు నిర్లక్ష్యంగా ఉంటున్నారంటే దానికి కారణం వారి తల్లులేనని కూతుళ్లను పట్టించుకోకుపోవటమేనని అన్నారు. తల్లుల నిర్లక్ష్యమే పలు అఘాయిత్యాలకు..అత్యాచారాలను తావిస్తోందని వ్యాఖ్యానించారు. మీనా కుమారి వివాదాస్పద వ్యాఖ్యలపై కమిషన్ వైస్ చైర్ పర్సన్ అంజూ చౌదరి.. స్పందిస్తూ..‘అమ్మాయిల నుంచి ఫోన్లను లాక్కున్నంత మాత్రాన మహిళలపై లైంగిక హింస ఆగదని.. మీనా కుమారి చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని కొట్టిపారేశారు. లైంగిక హింసలకు పరిష్కారం అదికాదనే విషయాన్ని గుర్తించాలని దయచేసి ఇటువంటి వ్యాఖ్యలు సరికావు అని సూచించారు.

అమ్మాయిలకు మొబైల్స్ ఇవ్వవద్దని చెప్పేబదులు..అపరిచితులతోనే కాదు పరియస్తులతో పాటు పలువురితో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నామని తెలిపారు. సమాజంలో జరిగే పలు హింసల గురించి పరిస్థితుల గురించి సమాజ పోకడల గురించి అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతీ తల్లిదండ్రులు వారి వారి పిల్లలకు సమాజంపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఫోన్లు ఎలా ఉపయోగించానో టెక్నాలజీని ఎలా వినియోగించుకోవాలో వివరించాలని..అంజూ చౌదరి సూచించారు.

కాగా అమ్మాయిలకు ఫోన్లు ఇస్తే అత్యాచారాలు జరుగుతాయని ఎందుకనుకుంటున్నారని మీనా కుమారిని ప్రశ్నించగా..మాకు ప్రతీరోజు వచ్చే 20 ఫిర్యాదుల్లో కనీసం ఐదు ఆరు ఫిర్యాదులు ఫోన్ల వినియోగం గురించే వస్తాయని తెలిపారు. ఫోన్ల తరచూ చాటింగ్ లు..కాల్స్ వల్ల అమ్మాయిలు అబ్బాయిల ఆకర్షణలో పడతారని వారిని నమ్మించి మోసం చేస్తుంటారని..లైంగిక వేధింపులకు గురైన ఘటనలు కూడా ఉన్నాయని తెలిపారు.