రాబోయే సంవత్సరాలలో మరింత గడ్డు పరిస్థితి

  • Published By: Subhan ,Published On : June 9, 2020 / 04:23 AM IST
రాబోయే సంవత్సరాలలో మరింత గడ్డు పరిస్థితి

ప్రస్తుతమున్న పరిస్థితుల కంటే మరింత ఘోరంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పడిపోతుందని ప్రపంచ బ్యాంక్‌ అంచనా వేస్తోంది. ఈ ఏడాది -5.2 శాతం క్షీణించనుందని పేర్కొంది. పలు దేశాలు కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడానికి షట్‌డౌన్‌ విధించడమే దీనికి కారణమని విశ్లేషించింది. అత్యంత దుర్భరమైన మాంద్యం 1870 తరవాత ఇప్పుడే వచ్చిందని ప్రపంచబ్యాంక్‌ అధ్యక్షుడు డేవిడ్‌ మల్‌పాస్‌ తెలిపారు. ఆయా దేశాల పాలకులు మరిన్ని చర్యలు తీసుకుంటేనే, ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకుంటుందని పేర్కొన్నారు.

* అభివృద్ధి చెందిన దేశాల్లో వృద్ధిరేటు -7 శాతంగా నమోదు కావచ్చని, ఆయా దేశాల్లో గిరాకీ, సరఫరా, వాణిజ్యం, రుణ వ్యవస్థలు దెబ్బతినడమే ఇందుకు కారణమని తెలిపారు. రెండో ప్రపంచ యుద్ధం తరవాత అంతటి దారుణమైన పరిస్థితిని ఇప్పుడే చూస్తున్నాయని పేర్కొన్నారు.

తలసరి ఆదాయం 3.6 శాతం తగ్గొచ్చు: ఈ ఏడాది ప్రజల తలసరి ఆదాయం 3.6 శాతం మేర తగ్గొచ్చని, ఫలితంగా లక్షల మంది అత్యంత పేదరికంలోకి జారిపోతారని ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా వైరస్‌ ప్రభావం అధికంగా ఉన్న దేశాల్లో ఆర్థిక కష్టాలు మరింత తీవ్రంగా ఉంటాయని పేర్కొంది. అంతర్జాతీయ వాణిజ్యం, కమోడిటీల ఎగుమతి, విదేశీ రుణాలపై ఆధారపడిన వ్యవస్థలు కూడా దుర్భరం అవుతాయని అంచనా వేసింది. 

విద్య, వైద్యంపై పడే ప్రతికూల ప్రభావం, మానవ వనరుల అభివృద్ధిని దెబ్బతీస్తుందని పేర్కొంది. ఆర్థిక పునరుత్తేజానికి ప్రపంచం ఐక్యంగా ప్రయత్నించాలని సూచించింది.

ప్రపంచ మాంద్యం 1870, 1876, 1885, 1893, 1908, 1914, 1917-21, 1930-32, 1938, 1945-46, 1975, 1982, 1991, 2009, 2020 సంవత్సరాలలో కనిపించింది. 

Read: కరోనా కాలం.. మాంసాహారం‌ కడగాల్సిందేనా..? ఐసీఎంఆర్‌ క్లారిటీ!