Go First Flight: ప్రయాణికుల్ని విడిచిపెట్టి వెళ్లిపోయిన విమానం.. పది లక్షల ఫైన్ వేసిన డీజీసీఏ

గో ఫస్ట్ ఎయిర్‌వేస్ సంస్థకు చెందిన జీ8 116 అనే విమానం ప్రయాణికుల్ని వదిలేసి వెళ్లిపోయిన ఘటన ఈ నెల 9న ఉదయం జరిగింది. గో ఫస్ట్ ఎయిర్‌వేస్ విమానం ఉదయం 06.40 గంటలకు బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్లాల్సి ఉంది.

Go First Flight: ప్రయాణికుల్ని విడిచిపెట్టి వెళ్లిపోయిన విమానం.. పది లక్షల ఫైన్ వేసిన డీజీసీఏ

Go First Flight: ప్రయాణికుల్ని వదిలేసి విమానం వెళ్లిపోయినందుకుగాను విమానయాన సంస్థకు భారీ జరిమానా విధించింది డీజీసీఏ. ఈ ఘటనకు కారణమైన గో ఫస్ట్ ఎయిర్‌వేస్ సంస్థకు రూ.10 లక్షల జరిమానా విధిస్తూ డీజీసీఏ నిర్ణయం తీసుకుంది.

India vs New Zealand: తొలి టీ20లో ముగిసిన న్యూజిలాండ్ ఇన్నింగ్స్.. భారత టార్గెట్ 177

గో ఫస్ట్ ఎయిర్‌వేస్ సంస్థకు చెందిన జీ8 116 అనే విమానం ప్రయాణికుల్ని వదిలేసి వెళ్లిపోయిన ఘటన ఈ నెల 9న ఉదయం జరిగింది. గో ఫస్ట్ ఎయిర్‌వేస్ విమానం ఉదయం 06.40 గంటలకు బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. అయితే, బోర్డింగ్ అయిన ప్రయాణికులు షటిల్ బస్ కోసం ఎయిర్‌పోర్టులో ఎదురుచూస్తూ ఉండగానే విమానం వెళ్లిపోయింది. ఒక బస్సులో పూర్తిగా నిండేంత మంది ప్రయాణికులు బస్సు కోసం వేచి చూస్తున్నప్పటికీ విమానం టేకాఫ్ అయింది. ఈ ఘటనపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా డీజీసీఏ, ఎయిర్‌పోర్టు సిబ్బందికి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై గో ఫస్ట్ ఎయిర్‌వేస్ సంస్థతోపాటు, డీజీసీఏ స్పందించింది.

India Women U19: ప్రపంచ కప్‌కు చేరువలో భారత్.. అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరి టీమిండియా

విమానయాన సంస్థకు డీజీసీఏ నోటీసులు జారీ చేసి, విచారణ జరిపింది. ఈ ఘటనలో అనేక లోపాలు ఉన్నట్లు డీజీసీఏ గుర్తించింది. ముఖ్యంగా కమ్యూనికేషన్, కో ఆర్డినేషన్, కన్ఫర్మేషన్ వంటి అంశాల్లో లోపాల వల్లే ఇలా జరిగిందని డీజీసీఏ వ్యాఖ్యానించింది. పూర్తి విచారణ జరిపిన అనంతరం గో ఫస్ట్ ఎయిర్‌వేస్ సంస్థకు రూ.10 లక్షల జరిమానా విధిస్తూ డీజీసీఏ నిర్ణయం తీసుకుంది. మరోవైపు విమానయాన సంస్థ కూడా ప్రయాణికులకు క్షమాపణలు తెలిపింది.