Maharashtra : ‘రాజ‌కీయాలు అర్థం కాకపోతే ఇంటికెళ్లి వంట చేసుకో’.. మహిళా ఎంపీపై బీజేపీ నేత వ్యాఖ్యలు

‘రాజ‌కీయాలు అర్థం కాకపోతే ఇంటికెళ్లి వంట చేసుకో’ అంటూ ఎన్సీపీ మహిళా ఎంపీపై బీజేపీ నేత వ్యాఖ్యలు చేశారు.

Maharashtra : ‘రాజ‌కీయాలు అర్థం కాకపోతే ఇంటికెళ్లి వంట చేసుకో’.. మహిళా ఎంపీపై బీజేపీ నేత వ్యాఖ్యలు

Maharashtra Bjp Chief Chandrakant Patil Controversial Remark On Mp Supriya Sule

Maharashtra : హిందూ సంప్రదాయాలను గౌరవించాలని హితబోధలు చేసే బీజేపీ నేతలు స్త్రీలను గౌరవించాలనే మాట మాత్రం మర్చిపోతారేమో. ఈ విషయం ఇప్పుడు ఎందుకు ప్రస్తావనకు వచ్చిదంటే..మ‌హారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్ర‌కాంత్ పాటిల్‌.. ఎన్సీపీ ఎంపీ సుప్రీయా సూలేపై అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. ‘మీకు రాజ‌కీయాలు అర్థం కాకుంటే, మీరు ఇంటికి వెళ్లి వంట‌చేసుకో’ అంటూ వ్యాఖ్యానించారు. మ‌హారాష్ట్ర‌లో ఉద్యోగాలు, విద్యాల‌యాల్లో ఓబీసీ రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేయాల‌ని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో బీజేపీ, ఎన్సీపీ మ‌ధ్య మాట‌ల‌ తూటాలు పేలాయి.

ఓబీసీ రిజర్వేషన్లపై జరిగిన నిరసన కార్యక్రమంలో పాటిల్ మాట్లాడుతూ.. ‘మీకు రాజకీయాలు అర్థం కాకపోతే ఇంటికెళ్లి వంట చేసుకో’ అంటూ సుప్రియా సులేను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఓబీసీ కోటా అమ‌లుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని..ఆ రాష్ట్ర సీఎం ఢిల్లీకి వచ్చి..అక్కడ ఎవ‌ర్నో క‌లిసార‌ని, ఆ మ‌రుస‌టి రెండు రోజుల‌కు ఓబీసీ రిజ‌ర్వేష‌న్ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చిన‌ట్లు సుప్రీయా సూలే ఓ కార్య‌క్ర‌మంలో కామెంట్ చేశారు.ఈ కామెంట్ పై మాట్లాడుతూ చంద్రకాంత్ పాటిల్ సులేపై ఈ వ్యాఖ్యలు చేశారు.

సుప్రీయాకు రాజ‌కీయాలు తెలియ‌వ‌ని, ఇంటికివెళ్లి వంట చేసుకోవాల‌ని, సీఎంను ఎలా క‌లవాలో కూడా నీకు తెలియ‌ద‌ని సుప్రీయాను ఉద్దేశిస్తూ పాటిల్ వ్యాఖ్యానించారు. దీంతో బీజేపీ నేత చంద్ర‌కాంత్ స్త్రీ ద్వేషి అని సుప్రీయా భ‌ర్త స‌దానంద సూలే త‌న ట్విట్ట‌ర్‌లో ఆరోపించారు. త‌న భార్య ప‌ట్ల త‌న‌కు గౌర‌వం ఉంద‌ని..ఆమె ఇంట్లో ప‌నిచేస్తుంద‌ని ఆమె బాధ్యతను ఆమె ఎప్పుడు విస్మరించలేదనీ..ఆమె ఓ త‌ల్లి అని, ఓ విజ‌య‌వంత‌మైన రాజ‌కీయ‌వేత్త అని స‌దానంద అన్నారు. చంద్ర‌కాంత్ వ్యాఖ్య‌లు మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచేలా ఉన్నాయ‌ని సదానంద సూలే అన్నారు. చంద్రకాంత్ పాటిల్ చేసిన వ్యాఖ్యలపై ఎన్సీపీ తీవ్రంగా మండిపడుతోంది. సుప్రీయా సూలే వంట చేసుకోవాలని వ్యాఖ్యనించిన చంద్రకాంత్ చంపాతలు చేయటం నేర్చుకోండి మీ భార్యకు వంటలో సహాయం చేయండి అంటూ వ్యాఖ్యానించింది ఎన్సీపీ.