వెళ్లండి ఓటు వేయండి: సైకత శిల్పంతో అవగాహన

  • Published By: veegamteam ,Published On : April 23, 2019 / 06:52 AM IST
వెళ్లండి ఓటు వేయండి: సైకత శిల్పంతో అవగాహన

సామాజికాంశాలపై అవగాహన కల్పించేలా ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఈసారి ఓటు హక్క అవగామనకోసం ఓ శిల్పాన్ని నిర్మించారు. ఓటు హక్కుపై అవగాహన కల్పించేలా ప్రముఖ సైకత శిల్పంతో  సుదర్శన్ పట్నాయక్ నిర్మించిన సైకత శిల్పం పలువురిని ఆకట్టుకుంటోంది. ఒడిశాకి చెందిన ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్  పలు సామాజిక అంశాలపై తన శిల్పాల ద్వారా స్పందిస్తుంటారు. 

2019 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మంగళవారం (ఏప్రిల్ 23)న 14 రాష్ట్రాల్లో మూడోదశ పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పూరి బీచ్‌లో తాను నిర్మించిన సైకత శిల్పాన్ని సుదర్శన్  ట్విటర్‌లో షేర్ చేసుకున్నారు. భారత ప్రజాస్వామ్యంలో సార్వత్రిక ఎన్నికలు అతిపెద్ద పండుగ. ఓటర్లకు అవగాహన కల్పించేలా… ‘‘వెళ్లి ఓటు వేయండి, మీ ఓటు లెక్కించేలా చేయండి’’ అన్న నినాదంతో పూరీ బీచ్‌లో నేను రూపొందించిన సైకత శిల్పం ఇది అంటు సుదర్శన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. తాను ఓటు హక్కుని వినియోగించుకున్నానని సుదర్శన్ పట్నాయక్ తెలిపారు.
 

ప్రజలందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు. కాగా తొలి, రెండో దశ ఎన్నికల్లోనూ ఆయన రూపొందించిన సైకత శిల్పాలు చూపరులను అమితంగా ఆకట్టుకున్నాయి.