Goa Assembly Election 2022: ‘ఒట్టు నిజ్జంగా పార్టీ మారం’..గోవా కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రతిజ్ఞ

‘ఒట్టు సార్.. నిజ్జంగా పార్టీ మారం’ అంటూ గోవా కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రతిజ్ఞ చేశారు. దానికి సంబంధించి విధేయతా పత్రాన్ని రాహుల్ గాంధీకి సమర్పించారు.

Goa, Assembly Election 202..Congress Candidates Loyalty Pledge : ఎన్నికలు వచ్చాయంటే చాలు కప్పలు దూకినట్లుగా అభ్యర్థులు పార్టీలు మారిపోవటం..కండువాలు మార్చేసుకోవటం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. ఒక పార్టీలో చేరి గెలిచాక తాము పోటీ చేసిన పార్టీ అధికారంలోకి రాకపోతే..అధికారంలోకి వచ్చిన పార్టీలోకి ‘జంప్’అయిపోతుంటారు. అటువంటి సంప్రదానికి చెక్ పెట్టటానికి రాహుల్ గాంధీ ఓ వినూత్న యత్నం చేశారు. కొత్త సంప్రదాయానికి తెర తీసిన రాహులు గాంధీ ‘కాంగ్రెస్ పార్టీకి మేం ఎప్పుడు విధేయులుగా ఉంటాం పార్టీ మారబోం’ అంటూ గోవాలో కాంగ్రెస్‌ అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయించారు.

ఎవరైనా ఎమ్మెల్యేలుగా..ఎంపీలుగా నెగ్గాక ప్రమాణస్వీకారంచేస్తారు. కానీ రాహుల్ గాందీ తమ అభ్యర్ధులతో ముందే ప్రమాణం చేయించారు పార్టీ మారబోం అంటూ.
రాహుల్‌ సమక్షంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో 37మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రతిజ్ఞ చేయించారు. గోవాలో 37 మంది కాంగ్రెస్‌ అభ్యర్థులు, భాగస్వామ్య పక్షమైన గోవా ఫార్వార్డ్‌ పార్టీ (జీఎఫ్‌పీ)కి చెందిన ముగ్గురు శుక్రవారం (పిబ్రవరి 4,2022)రాహుల్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌ సమక్షంలో ఈ ప్రతిజ్ఞ చేశారు ఎమ్మెల్యేలు.

Also read : Goa Assembly Election : ప్రతి పేదవాడికి నెలకు రూ. 6 వేలు.. రాహుల్ వరాలు

గెలిచాక పార్టీమారబోమని ముక్తకంఠంతో చెప్పారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. కాగా పార్టీ మారబోమని ఇప్పటికే వీళ్లంతా అన్ని మతాలకు చెందిన దేవాలయాల్లోను ఒట్లు వేశారు. హిందూ దేవాలయాలతో పాటు..చర్చి, మసీదుల్లో ఒట్టు వేశారు. ఇదేదో నామ మాత్రపు ప్రతిజ్ఞకాకుండా రాహుల్ గాంధీ పకడ్బంధీగా చేయించారు.

రాహుల్‌ ముందూ ప్రతిజ్ఞ చేసినవారంతా ‘విధేయతా పత్రాలు’’ కూడా సమర్పించారు. ఈసారి కాంగ్రెస్, జీఎఫ్‌పీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని, అందుకు అన్నివిధాలా సహకరిస్తామని అందులో ఆ విధేయతా పత్రాల్లో రాసి సంతకాలు చేసి ఇచ్చారు. కాగా గతంలో ఇటువంటి దెబ్బతిన్న కాంగ్రెస్ ఈసారి కాస్త వినూత్నంగా..ముందు జాగ్రత్తగా వ్యవహరించింది.2017 ఎన్నికల్లో కాంగ్రెస్‌ 17 సీట్లు గెలిచినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయారు. ఏకంగా 15 మంది కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు బీజేపీలోకి మారిపోవటంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ఈసారి రాహుల్‌ ఇలా అభ్యర్థులతో ముందే ప్రమాణం చేయించుకున్నారు.

Also read : Viral News : చంటిబిడ్డను ఎత్తుకుని..టీవీ లైవ్‌లో రిపోర్టింగ్

కాగా..గోవా రాజకీయాలంటేనే ఫిరాయింపులకు పెట్టింది పేరు. 40 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో ఎమ్మెల్యేలు రాత్రికి రాత్రి కండువాలు మార్చేస్తూ ఉంటారు. ఇది గోవాలో కొత్తేం కాదు. పార్టీబలాలను పెంచుకోవటానికి అధికారంలోకి రావటానికి ఆపరేషన్ ఆకర్ష్ లు చేస్తుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఎప్పుడు పడిపోతాయో చెప్పలేం. ఇటువంటి వెన్ను పోట్లకు ఈరోజు సీఎంగా ఉన్నవ్యక్తి తెల్లారేసరికి మామూలు ఎమ్మెల్యేగా మారిపోవాల్సిన పరిస్థితులుంటాయి. ఈ ఫిరాయింపుల సంస్కృతికి ఇక స్వస్తి చెప్పాలంటూ కాంగ్రెస్‌ నినదిస్తోంది. కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ ఈ విషయంలో కొత్త తరహాలో ‘ప్రతిజ్ఞ’ సంప్రదాయానికి తెర తీశారు. కానీ ఇది ఎంత వరకు అమలు జరుగుతుందో..ప్రతిజ్ఞ చేసిన వారు ‘ఒట్టు’కు విలువ ఇస్తారా? లేదా ‘ఒట్టు తీసి గోవా బీట్ గట్టు’మీద పెట్టామంటారో వేచి చూడాలి..

Also read : BTech question paper : సినిమా కథపై బీటెక్ పశ్నాపత్రం..విద్యార్ధులు షాక్..

కాగా..గోవాలో ఫిబ్రవరి 14న ఎన్నికలు జరగనున్నాయి. గోవా అసెంబ్లీ ఎన్నికలు 2022 ఫిబ్రవరి 14న జరగనుంది. భారత ఎన్నికల సంఘం ప్రకారం మార్చి 10న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. గోవాలో గెలుపు కోసం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా శ్రమిస్తున్నారు.కొత్త పథకాలను ప్రకటిస్తున్నారు. దీంట్లో భాగంగా..కొత్త ‘న్యాయ్ పథకం’ ప్రారంభించబడుతుందని..ఈ పథకం కింద పేదలకు నెలకు రూ. 6,000 ఇస్తామని ప్రకటించారు. అంటే ఒక సంవత్సరంలో రూ. 72,000 ఇస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు.

ట్రెండింగ్ వార్తలు