Goa Assembly Elections 2022 : ఫిబ్రవరి 14 న ఒకే దశలో గోవా అసెంబ్లీ ఎన్నికలు-మార్చి10న ఫలితాలు
గోవాలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 21 స్థానాల మెజార్టీ ఉండాలి. బీజేపీ కూటమికి 25 స్థానాలుండగా, కాంగ్రెస్‌కు రెండు, ఇతరులకు ఏడు ఉన్నాయి.

Goa Assembly Elections 2022
Goa Assembly Elections 2022 : ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గోవా అసెంబ్లీ ఎన్నికల 2022 షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది. దేశంలో కోవిడ్ థర్డ్ వేవ్ కారణంగా ఎన్నికలు ఆలస్యమవుతాయనే ఊహాగానాలకు ఇది తెరదింపింది. గోవాలో బీజేపీ అధికారంలో ఉండగా, ప్రతిపక్షంలో గోవా ఫార్వర్డ్ పార్టీ, మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ, కాంగ్రెస్ ఉన్నాయి.
గోవాలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 21 స్థానాల మెజార్టీ ఉండాలి. బీజేపీ కూటమికి 25 స్థానాలుండగా, కాంగ్రెస్‌కు రెండు, ఇతరులకు ఏడు ఉన్నాయి. 2017 ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించకపోయినప్పటికీ.. ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
అయితే మొదట్నుంచీ గోవా బీజేపీ రాజకీయాలకు దిక్సూచిగా ఉన్న మనోహార్ పారికర్ లేకపోవడం ఆ పార్టీకి పెద్ద దెబ్బ. ఈసారి తృణమూల్ కూడా గోవా ఎన్నికల బరిలో దిగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ పోటీచేస్తున్నట్టు ప్రకటించింది. గత ఎన్నిలతో పోలిస్తే.. ఇప్పటికి కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారింది. ఈ ఎన్నికల్లో బీజేపీ వర్సెస్ తృణమూల్ ప్రధాన ప్రత్యర్ధులుగా తలపడే అవకాశముంది.
Also Read : Assembly Elections : పంజాబ్‌లో కాంగ్రెస్‌కి ఇజ్జత్‌కా సవాల్
కొందరు కాంగ్రెస్ నేతలు ఇప్పటికే తృణమూల్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఎన్నికల్లో తృణమూల్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందన్న అంచనాలు వెలువడుతున్నాయి. గోవాలో క్యాథలిక్ చర్చి అత్యంత శక్తిమైంది. తృణమూల్ వైపు ఉంటుందా.. కాంగ్రెస్‌కు మద్దతిస్తుందా అన్నదానిపై ఇంకా చర్చి నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. 2022 మార్చిలో గోవా అసెంబ్లీ గడువు ముగుస్తుంది.
గోవాలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 40
మ్యాజిక్ ఫిగర్ 21
మనోహర్ పారికర్ లేకుండా జరుగుతున్న తొలి ఎన్నికలు