రాఫెల్ స్కామ్ మొదటి బాధితుడు పారికర్

  • Published By: venkaiahnaidu ,Published On : March 19, 2019 / 10:44 AM IST
రాఫెల్ స్కామ్ మొదటి బాధితుడు పారికర్

దివంగత గోవా సీఎం మనోహర్ పారికర్ మరణంపై రాజకీయాలు మొదలయ్యాయి. రాఫెల్ కుంభకోణంలో మొదటి బాధితుడు మనోహర్ పారికర్ అని మహారాష్ట్ర ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర ఆవాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాఫెల్ కుంభకోణం వెలుగులోకి వచ్చిన వెంటనే పారికర్ తన కేంద్రమంత్రి పదవి వదిలేసి గోవా రాజకీయాల్లోకి వచ్చేశారని జితేంద్ర అన్నారు. అనేకసార్లు తాను రాఫెల్ బాధితుడినయ్యాను అంటూ పారికర్ తన సన్నిహితుల దగ్గర బాధపడేవాడని ఆయన అన్నారు. 
Read Also : చైనాకు దలైలామా వార్నింగ్: నా వారసుడు భారతీయుడే

రాఫెల్ అవినీతి హాట్ టాపిక్ గా మారిన సమయంలో పారికర్ దిగులుపడ్డారని అన్నారు. ఏ ఒక్కరూ కూడా పారికర్ నే వేలెత్తి చూపించలేదన్నారు. పారికర్ అవినీతి పరుడు కాదని ఆయన వ్యక్తిత్వమే చెబుతుందని,కానీ అవినీతి ఆయనను అంటకాగి చిత్రహింసలు పడ్డారని, ఈ భాధతోనే క్యాన్సర్ కు వ్యతిరేకంగా ఆయన పోరాడలేకపోయారని,అదే అతడి మరణానికి కారణమైందని జితేంద్ర తెలిపారు.

ఏడాదిగా క్లోమ గ్రంథి క్యాన్సర్ తో బాధపడుతూ ఆదివారం(మార్చి-17,2019)మనోపార్ పారికర్ మృతి చెందారు.సోమవారం ఆయన అంత్యక్రియలు గోవాలోని మిరామిర్ బీచ్ లో సైనిక లాంఛనాలతో పూర్తయ్యాయి.