Goa Congress : గోవా కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నేతపై వేటు

ఫిరాయింపులతోపాటు గోవాలో కాంగ్రెస్‌ను బలహీనపర్చేందుకుగానూ బీజేపీతో కలిసి సొంత నేతలే కొందరు కుట్ర పన్నారని ఆరోపించారు. మైఖేల్ లోబో, దిగంబర్ కామత్ దీనికి నాయకత్వం వహించారు అని వివరించారు. ఈ ఇద్దరు.. బీజేపీతో పూర్తి సమన్వయంతో పని చేస్తున్నారని చెప్పారు.

Goa Congress : గోవా కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నేతపై వేటు

Michael Lobo

Goa Congress : గోవా కాంగ్రెస్‌లో ముసలం పుట్టింది. హస్తానికి కొంతమంది ఎమ్మెల్యేలు హ్యాండిస్తారన్న ప్రచారంతో కాంగ్రెస్‌ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు ఏడుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతున్నారన్న వార్తల నేపథ్యంలో.. అధిష్ఠానం నష్టనివారణ చర్యలకు దిగింది. సొంత పార్టీ నేతలే ఈ పుకార్లు సృష్టించారని ఆరోపిస్తూ.. అసెంబ్లీలో సభాపక్ష నేతగా ఉన్న మైఖేల్ లోబోను ఆ పదవి నుంచి తప్పించింది. పార్టీ గోవా ఇన్‌ఛార్జి దినేశ్‌ గుండు రావు ఈ విషయాన్ని వెల్లడించారు. తమ పార్టీని బలహీనపరిచేందుకు కొంతమంది నాయకులు కుట్రపన్నారని ఆయన అన్నారు.

ఫిరాయింపులతోపాటు గోవాలో కాంగ్రెస్‌ను బలహీనపర్చేందుకుగానూ బీజేపీతో కలిసి సొంత నేతలే కొందరు కుట్ర పన్నారని ఆరోపించారు. మైఖేల్ లోబో, దిగంబర్ కామత్ దీనికి నాయకత్వం వహించారు అని వివరించారు. ఈ ఇద్దరు.. బీజేపీతో పూర్తి సమన్వయంతో పని చేస్తున్నారని చెప్పారు. అధికారం, పదవి కోసం లోబో పాకులాడారని, మరోవైపు కామత్‌.. తనపై ఉన్న కేసులనుంచి బయటపడేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని అంతం చేసేందుకు బీజేపీ యత్నిస్తోందని మండిపడ్డారు.
Goa Congress: గోవాలో ఏం జరుగుతోంది.. బీజేపీతో టచ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు?

మరోవైపు సండే జరిగిన పార్టీ సమావేశానికి ఏడుగురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం గోవా కాంగ్రెస్‌లో తీవ్ర కలకలం చెలరేగింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థిగా బరిలో దిగిన దిగంబర్‌ కామత్‌ సైతం ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. దీంతో వారు పార్టీని వీడనున్నారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. బీజేపీతో టచ్‌లో ఉన్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే, ఈ వార్తలను కాంగ్రెస్‌ కొట్టిపారేసింది. బీజేపీ కావాలనే ఇలాంటి పుకార్లు పుట్టిస్తోందని కాంగ్రెస్‌ గోవా చీఫ్‌ అమిత్‌ పాట్కర్‌ ఆరోపించారు. ఈ క్రమంలోనే.. తాజా చర్యలు తీసుకోవడం గమనార్హం.