Goa Congress : గోవాలో కాంగ్రెస్ కి మరో బిగ్ షాక్..ఆప్ లో చేరిన మాజీ డిప్యూటీ సీఎం

వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న గోవాలో కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గత గోవా మీజీ సీఎం లుయీజిన్హో ఫలేరో కాంగ్రెస్ కు హ్యాండిచ్చి

10TV Telugu News

Goa Congress  వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న గోవాలో కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గత గోవా మీజీ సీఎం లుయీజిన్హో ఫలేరో కాంగ్రెస్ కు హ్యాండిచ్చి తృణముల్ కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే.

తాజాగా గోవా మాజీ డిప్యూటీ సీఎం ద‌యానంద్ నర్వేక‌ర్ కాంగ్రెస్‌ను వీడి ఇవాళ ఢిల్లీలో కేజ్రీవాల్ సమక్షంలో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఆప్ అధినేత అర‌వింద్ కేజ్రివాల్ ఆయ‌న‌కు కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. న‌ర్వేక‌ర్.. గోవాలోని అల్డోనా అసెంబ్లీ స్థానం నుంచి ఐదు సార్లు కాంగ్రెస్ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలిచారు. 1999 న‌వంబ‌ర్ నుంచి 2000 అక్టోబ‌ర్ వ‌ర‌కు గోవా డిప్యూటీ సీఎం కూడా ప‌నిచేశారు

ఆప్ లో చేరిన తర్వాత ద‌యానంద్ నర్వేక‌ర్ విలేఖరులతో మాట్లాడుతూ… ఆమ్ ఆద్మీ పార్టీ మంచి నిర్మాణాత్మక పార్టీ అన్నారు. ఢిల్లీలో ఆప్ పాలన అద్భుతమని ప్రశంసించారు. గోవాలో కూడా ఆప్ ని గెలిపిస్తే మంచి పాలన అందిస్తుందన్నారు. కరోనా మహమ్మారి సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ గోవాలో స్థానిక జనాభాతో ఉండి వారికి అవసరమైన అన్ని సహాయాలను అందించిందన్నారు. గోవా ప్ర‌జ‌ల్లో ఆమ్ ఆద్మీ పార్టీపై మంచి అభిప్రాయం ఏర్ప‌డింద‌ని, అందుకే తాను ఆప్‌లో చేరాన‌ని నర్వేక‌ర్ చెప్పారు.ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ పని తనను ఆకట్టుకుందన్నారు.

ALSO READ UP Election : ఎస్పీ-ఎస్బీఎస్పీ మధ్య కుదిరిన పొత్తు