Covidపై యుద్ధంలో మాజీ సెక్స్ వర్కర్ల పనితనం

Covidపై యుద్ధంలో మాజీ సెక్స్ వర్కర్ల పనితనం

COVID-19 మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడేందుకు హెల్త్ వర్కర్లు, పోలీసులతో పాటుగా మాజీ సెక్స్ వర్కర్లు కూడా చేతులు కలిపారు. అర్జ్ ఎన్జీవో (అన్యాయ రహిత్ జిందగీ) ప్రభావంతో సెక్స్ వృత్తి నుంచి సామాన్య జీవితంలోకి అడుగుపెట్టిన మహిళలు కరోనాపై పోరాటంలో మేము సైతం అంటూ ముందుకొచ్చారు. కొవిడ్ 19 పేషెంట్ల బెడ్ క్లీన్ చేయడంలో.. వాటిని లాండ్రీ చేయడానికి సిద్ధమయ్యాు.

కొవిడ్ కేర్ సెంటర్ల నుంచి పేషెంట్లు వాడిన బట్టలు సేకరించి.. వీరు శుభ్రం చేసిన తర్వాతనే వాషింగ్, ఐరెనింగ్ కు పంపిస్తారు. కొవిడ్ భయంతో అందరినీ ఇళ్లలో పెట్టేస్తుంటే, హాట్ స్పాట్లంటే వీధుల్లో తిరగడానికి భయమేస్తున్నప్పుడు ధైర్యంగా అడుగేసి లాండ్రీ పనిని కొనసాగిస్తున్నారు.

‘అందరికీ ఉన్నట్లే మాకు కూడా భయాలు ఉన్నాయి. కానీ, కొవిడ్ కేర్ సెంటర్ల నుంచి వచ్చిన క్లాత్స్ లాండ్రీ చేయడానికి వచ్చినప్పుడు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో ట్రైనింగ్ అయ్యే ఉన్నాం. అని వారిలో ఒకరు అంటున్నారు. వారికి విటమిన్ ట్యాబ్లెట్లతో పాటు ప్రొటెక్టివ్ గేర్, మాస్కులు, గ్లౌజులు, షీల్డు, పీపీఈ కిట్లు ఏర్పాటుచేస్తున్నారు.

మరో వ్యక్తి ఈ పని చేస్తున్నందుకు గర్వపడుతున్నట్లు చెప్పింది. ‘నేను ఎవరినీ వివక్షతో చూడను. ఇదొక జబ్బు అనుకుంటున్నాను. ఎవరికైనా రావొచ్చు. డాక్టర్లు, నర్సులు, పోలీసులు, కొవిడ్ కేర్ సెంటర్లు మాకు రోల్ మోడల్స్. వారు కూడా ప్రాణాలకు తెగించి సర్వీస్ అందిస్తున్నారు’ అని చెప్పింది.