Goa Results : గోవా అంటేనే గోడ దుంకుడు..! అధికారంపై పార్టీల్లో గుబుల్

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు సాధించినప్పటికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది కాంగ్రెస్ . ఈసారి కూడా అదే జరుగుతుందన్న భయం కాంగ్రెస్‌ను వెంటాడుతోంది.

Goa Results : గోవా అంటేనే గోడ దుంకుడు..! అధికారంపై పార్టీల్లో గుబుల్

Goa Results

Goa Results : గోవా.. టూరిజం స్టేట్‌ ఇప్పుడు పొలిటికల్‌గా హీటెక్కింది. అక్కడి ప్రజలు ఎవర్ని గో అంటున్నారు? ఎవర్ని రావా అంటున్నారనేది కాసేపట్లో రివీల్ కానుంది. అయితే గో..వా అంటూ హంగ్ సిట్యుయేషన్ తీసుకొస్తున్నట్లు కనిపిస్తోంది. గతంలో లాగే ఏ ప్రభుత్వానికి సంపూర్ణ మెజార్టీ ఇవ్వకుండా.. అభ్యర్థుల్లో మళ్లీ టెన్షన్ పుట్టిస్తున్నారు గోవా పీపుల్.

Read This : Punjab Results : పంజాబ్ పల్స్ ఏంటి..? కేజ్రీవాల్ ‘చీపురు’తో ఊడ్చేయనున్నారా..?

గోవాలో సీన్‌ రివర్స్ అయ్యేలా ఉంది. ఏ పార్టీకి పూర్తి మెజార్టీ.. రాక హంగ్ ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గోవాలో 40 స్థానాల్లో బీజేపీ – కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ ఉందని ఎగ్జిట్‌పోల్స్‌ అంచనా వేశాయి.

– ఇండియాటుడే సర్వే ప్రకారం బీజేపీకి 14 నుంచి 18, కాంగ్రెస్‌కు 15 నుంచి 20 సీట్లు రావొచ్చు. ఇతరులకు 2 నుంచి 9 చోట్ల ఛాన్స్ ఉంది.

– ABP సీ ఓటర్‌ అయితే బీజేపీకి 13 నుంచి 17, కాంగ్రెస్‌కు 12 నుంచి 16, ఇతరులకు 5నుంచి 11 రావొచ్చంటోంది.

– జన్‌కీ బాత్‌, ఇండియాటీవీ, టైమ్స్‌నౌ కూడా హంగ్‌నే అంచనా వేస్తున్నాయి. టీఎంసీ, ఆప్‌లు ఒకటి రెండు స్థానాల్లో గెలవొచ్చు. ఇవే ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కావొచ్చని దాదాపు అన్ని ఎగ్జిట్‌పోల్స్ చెబుతున్నాయి.

Read This : Election Results : యూపీలో బీపీ.. గెలుపెవరిది..?

2017 గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అత్యధికంగా 17 సీట్లతో అతిపెద్ద పార్టీగా మారింది. ఆ తర్వాత బీజేపీకి 13, ఇతరులకు 10 రాగా ఆప్ ఖాతా తెరవలేదు. అయితే బీజేపీ ఇతరులతో కలిసి అధికారాన్ని చేజిక్కించుకుంది. నాటి పరిస్థితి మళ్లీ రిపీట్ కాకుండా చూసుకునేందుకు కాంగ్రెస్‌, ఆప్‌ తమ అభ్యర్థుల్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్‌ ఇప్పటికే తన క్యాండిడేట్లను రిసార్టుకు తరలించగా.. ఇప్పుడు ఆమ్‌ అద్మీ పార్టీ ఆ తరహాలోనే వ్యవహరిస్తోంది. తమ అభ్యర్థుల్ని రక్షించుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాయి.

కాంగ్రెస్‌ ఇప్పటికే తమ అభ్యర్థులందరినీ ఉత్తర గోవాలోని ఓ రిసార్ట్‌కు తరలించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ క్యాంప్‌ బాధ్యతను ట్రబుల్‌ షూటర్‌ డీకే శివకుమార్‌కు అప్పగించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు సాధించినప్పటికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది కాంగ్రెస్ . ఈసారి కూడా అదే జరుగుతుందన్న భయం కాంగ్రెస్‌ను వెంటాడుతోంది. బీజేపీ కూడా తమ అభ్యర్థుల్ని రహస్య ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం లోపు అసలు విషయం తేలిపోనుండడంతో.. ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరి మార్గాల్లో వాళ్లు ప్రయత్నాలు మొదలుపెడుతున్నారు మరి.