గోవా బీచ్‌లలో ఆల్కహాల్ తాగితే రూ.10వేలు ఫైన్

గోవా టూరిజం డిపార్ట్‌మెంట్ బీచ్‌లలో కూర్చొని తాగితే రూ.10వేలు ఫైన్ వేయడానికి డిసైడ్ అయిపోయింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తర్వాత బీచ్‌లలోని పలు ప్రాంతాల్లో ఖాళీ బాటిళ్లు, పగిలిన సీసాలు కనిపించాయని శుక్రవారం అధికారులు చెప్పారు.

గోవా బీచ్‌లలో ఆల్కహాల్ తాగితే రూ.10వేలు ఫైన్

Goa Beaches: గోవా టూరిజం డిపార్ట్‌మెంట్ బీచ్‌లలో కూర్చొని తాగితే రూ.10వేలు ఫైన్ వేయడానికి డిసైడ్ అయిపోయింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తర్వాత బీచ్‌లలోని పలు ప్రాంతాల్లో ఖాళీ బాటిళ్లు, పగిలిన సీసాలు కనిపించాయని శుక్రవారం అధికారులు చెప్పారు.

రాష్ట్ర టూరిజం డైరక్టర్ మెనినో డిసౌజ్ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ.. బీచ్ లలో మందు తాగడాన్ని హెచ్చరించారు. జనవరి 2019లోనే టూరిజం ట్రేడ్ యాక్ట్ అమెండ్‌మెంట్‌ను ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఆ జరిమానాను రూ.2వేల నుంచి రూ.10వేలకు పెంచారు. బీచ్ లలో తాగితే కచ్చితంగా రూ.10వేలు కట్టాల్సిందేనని అధికారులు చెప్పారు.

టూరిజం డిపార్ట్‌మెంట్ అమెండెడ్ యాక్ట్‌ను పోలీసుల ద్వారా అమలుచేయాలని చూస్తుంది. మనం టూరిస్ట్ పోలీస్ ఫోర్స్ ఉంటే సొంతగానే దీనిని అమలు చేయొచ్చని అధికారులు అంటున్నారు.