రూపాయి బలపడుద్దట: కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి చిత్రం

  • Published By: vamsi ,Published On : January 16, 2020 / 01:34 AM IST
రూపాయి బలపడుద్దట: కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి చిత్రం

కాంట్రవర్షియల్ కామెంట్లు చెయ్యడానికి ముందుండే వ్యక్తి బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి. మరోసారి కాంట్రవర్శీ కామెంట్ చేసి వార్తల్లో నిలిచాడు ఆయన. మధ్యప్రదేశ్‌లోని ఖంద్వా జిల్లాలో స్వామి వివేకానంద వ్యాఖ్యానమాల పేరిట చేసిన ప్రసంగాల్లో భాగంగా మాట్లాడిన స్వామి.. ఇండోనేసియా కరెన్సీ మీద గణపతి చిత్రం ఉండే విషయమై ఒకరు సంధించిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ప్రధాని మోడీ మాత్రమే దీనికి సమాధానం ఇవ్వగలరని అన్నారు.

ఇటువంటి ఆలోచనకు నేను అనుకూలమే అని అన్న ఆయన.. గణేషుడు విఘ్నాలను తొలగిస్తాడని అన్నారు. అంతే కాదు కరెన్సీ నోట్ల మీద లక్ష్మీదేవి చిత్రాన్ని ఉంచితే భారత కరెన్సీ పరిస్థితిని మెరుగుపరిచే అవకాశం ఉందని అన్నారు. దీని గురించి ఎవరూ చెడుగా ఫీలవరు అని కూడా అభిప్రాయపడ్డారు. ఇదెంత వరకు సాధ్యమో తెలీదు కానీ.. కరెన్సీ నోట్లపై లక్ష్మీ దేవి చిత్రాన్ని ముద్రించడం ద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుద్దేమో అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. రూపాయి కూడా బలపడుతుందేమో అని అన్నారు. 

పౌరసత్వ సవరణ చట్టాన్ని కాంగ్రెస్, మహత్మా గాంధీ కోరుకున్నారని వెల్లడించిన సుబ్రహ్మణ్య స్వామి.. 2003లో మన్మోహన్ సింగ్ కూడా పార్లమెంట్‌ను ఇదే కోరారని అన్నారు. పాకిస్తానీ ముస్లింలకు అన్యాయం చేస్తున్నామంటూ ఇప్పుడు వారు దీన్ని అంగీకరించట్లేదని అన్నారు. బీజేపీ ప్రభుత్వం త్వరలోనే ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫాం సివిల్ కోడ్) ని ప్రవేశపెడుతుందని స్వామి తెలిపారు.