లాక్ డౌన్ బ్రేక్ చేసిన ‘దేవుడు’ అరెస్ట్..వెంటనే..

  • Published By: nagamani ,Published On : May 28, 2020 / 11:59 AM IST
లాక్ డౌన్ బ్రేక్ చేసిన ‘దేవుడు’ అరెస్ట్..వెంటనే..

నేనే దేవుడ్ని..లాక్ డౌన్ డౌన్ రూల్స్ నాకు పనికిరావు..అటువంటివి దేవుళ్లకు వర్తించవు నా ఇష్టమొచ్చినట్లుగా చేస్తాను.. అన్నట్లుగా..లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన స్వయం ప్రకటిత దేవుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే తనను తాను దేవుడిగా ప్రకటించుకున్న దాతి మహారాజ్ ను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఢిల్లీలో ఓ ఆలయంలో మత పరమైన ఓ కార్యక్రమాన్ని మహారాజ్ నిర్వహించారు. ఈ  కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవ్వటంతో..మహారాజ్ లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ పోలీసులు అంటువ్యాధి వ్యాధుల చట్టంలోని సెక్షన్ 3 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. 

కానీ అరెస్ట్ అయిన కొద్దిసేపటికే మహారాజ్ ను పోలీసులు విడిచిపెట్టారు. అరెస్ట్ అయిన స్వామిని పోలీసులు విచారించారు. తర్వాత ఆయనకు బెయిల్ ఇచ్చినట్టు డిప్యూటీ పోలీస్ కమిషనర్ అతుల్ కుమార్ ఠాకూర్ తెలిపారు.

ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దాటి మహరాజ్ ను పోలీసులు అరెస్ట్ చేయాల్సి వచ్చింది.తర్వాత పోలీసులు దర్యాప్తులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది దాతి మహారాజ్ అని తేలటంతో అరెస్ట్ చేశారు. కానీ కొద్దిసేపటికే వదిలేయటం గమనించాల్సిన విషయం.

కాగా..దక్షిణ ఢిల్లీతో పాటు రాజస్థాన్ ప్రాంతాల్లో దాతి మహారాజ్ కు ఆశ్రమాలున్న దాతి మహారాజ్ పై అత్యాచారంకేసులు కూడా ఉన్నాయి. 

Read: ఆకుపచ్చ సొనలతో గుడ్లు పెడుతున్న ఆరు కోళ్లు..ఎందుకంటే..