Hindustan Unilever బాటలో Godrej, ఆ సబ్బులపై ఇక Fair అనే పదం కనిపించదు

  • Published By: naveen ,Published On : August 26, 2020 / 12:37 PM IST
Hindustan Unilever బాటలో Godrej, ఆ సబ్బులపై ఇక Fair అనే పదం కనిపించదు

దేశంలోనే రెండో అతిపెద్ద సోప్ తయారీ కంపెనీ గోద్రెజ్ కన్సూమర్ ప్రొడక్ట్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఫెయిర్ అనే పదాన్ని వాడకూడదని గోద్రెజ్ నిర్ణయించింది. తాము ఉత్పత్తి చేసే సబ్బులపై ఫెయిర్ అనే పదం ప్రింట్ చేయరు. దీనికి కారణం లేకపోలేదు. ప్రపంచవ్యాప్తంగా వర్ణ వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతోంది. నలుపు, తెలుపు అనే పేరుతో కొన్ని కంపెనీలు, ఉత్పత్తులు వివక్షను పెంచుతున్నాయనే ఫిర్యాదులు అందుతున్నాయి. ఫెయిర్ అనే పదం వివక్షకు తావిస్తోందని ఆరోపణలు ఉన్నాయి. ఫెయిర్ అనే పదంపై పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతోంది. ఈ క్రమంలో గోద్రెజ్ సైతం ఈ నిర్ణయం తీసుకుంది.

ఫెయిర్ గ్లో(Fair Glow) బ్రాండ్ పేరుతో గోద్రెజ్ కంపెనీ సోప్స్ విక్రయిస్తోంది. హ్యాండ్ వాష్, వైప్స్ కూడా విక్రయిస్తోంది. గోద్రెజ్ చేసే బిజినెస్ లో వీటిది 26శాతం వాటా. మేము ఫెయిర్ గ్లో వెనుక పెట్టుబడులు పెట్టలేదు. ఆ కారణంతో ఇతర కంపెనీల మాదిరి ఆ బ్రాండ్ నుంచి దూరంగా జరగడమూ లేదు అని గోద్రెజ్ కన్సూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్(GPCL) ఎగ్జిక్యూటివ్ చైర్ పర్సన్, ఎండీ నిసాబా గోద్రెజ్ అన్నారు. అది మాకు చాలా చిన్న బ్రాండ్. కేవలం పేరు మాత్రమే మారుస్తున్నాం. వినియోగదారుడికి, మాకు ఇది సరైన సమయం అని నేను భావిస్తున్నా అని నిసాబా గోద్రెజ్ అన్నారు. అన్ని కన్సూమర్ ప్రొడక్ట్ కంపెనీలు ప్రస్తుతం ఇదే పని చేస్తున్నాయని అని చెప్పారు.

గోద్రెజ్ మాత్రమే కాదు, ఇప్పటికే పలు ప్రముఖ కంపెనీలు ఫెయిర్ అనే పదాన్ని తమ ఉత్పత్తుల నుంచి తొలగించాయి. ఏకంగా బ్రాండ్ నేమే చేంజ్ చేశాయి. ఇప్పటికే భారత దేశపు అతిపెద్ద కన్సూమర్ గూడ్స్ ఫర్మ్ హిందుస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంది. 40 ఏళ్ల చరిత్ర ఉన్న ఫెయిర్ అండ్ లవ్లీ(Fair and Lovely) ప్రొడక్ట్ నుంచి ఫెయిర్ అనే పదాన్ని తొలగించింది. ఫెయిర్ అండ్ లవ్లీ దేశంలోనే ఎక్కువగా అమ్ముడవుతున్న ఫేస్ కేర్ బ్రాండ్ ప్రొడక్ట్. జూలైలో ఫెయిర్ అండ్ లవ్లీ పేరుని గ్లో అండ్ లవ్లీగా(Glow and Lovely) మార్చేశారు. అలాగే పురుషులకు సంబంధించి ఫెయిర్ అండ్ లవ్లీ బదులుగా గ్లో అండ్ హ్యాండ్ సమ్(Glow and Handsome) గా మార్పు చేశారు. హిందుస్థాన్ యూనీలివర్ సంస్థ ఉత్పత్తి చేస్తున్న ఫెయిర్ అండ్ లవ్లీ బ్రాండ్ దేశీయ మార్కెట్ లో మంచి విజయం సాధించింది. విపరీతంగా సేల్స్ అవుతున్నాయి.

భారత దేశంతో పాటు అంతర్జాతీయంగా ఫెయిర్ అండ్ లవ్లీ సౌందర్య సాధనాల జాబితాలో ప్రధానంగా ఉంటూ వస్తోంది. దీంతో పాటు ఈ పేరును ప్రమోట్ చేయడానికి సంస్థ కోట్లాది రూపాయలు మార్కెటింగ్ కోసం వెచ్చిస్తోంది. అయితే అమెరికాలో వర్ణ వివక్ష ఉద్యమం మొదలు కావడంతో బ్రాండ్ పేరును మార్చేసింది. ఫ్రెంచ్ బ్యూటీ కంపెనీ లోరియల్ కూడా ఫెయిర్ అనే పదంపై స్పందించింది. వైట్(White), ఫెయిర్(Fair), లైట్(Light) అనే పదాలను తమకు చెందిన అన్ని చర్మ సంబంధ ఉత్పత్తులపై నుంచి తొలగిస్తామంది. జాన్సన్ అండ్ జాన్సన్ కూడా అదే బాటలో ఉంది.

గోద్రెజ్ డిసెంబర్ 1999లో ఫెయిర్ గ్లో సోప్ తీసుకొచ్చింది. కాగా ఫెయిర్ నెస్ కు సంబంధించి సోప్ లు, క్రీములు చాలానే వచ్చాయి. అయితే ఎక్కువ మంది సోప్స్ ను కొనుగోలు చేస్తున్నారు. దీనికి కారణం క్రీమ్స్ తో పోలిస్తే సోప్స్ ధర చాలా తక్కువగా ఉండటమే.

అమెరికాలో నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్య తర్వాత వర్ష వివక్షకు వ్యతిరేకంగా అక్కడ పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతోంది. జార్జి ఫ్లాయిడ్‌ అనే నల్ల జాతీయుడిని ఓ శ్వేత జాతీయుడైన అమెరికా పోలీసు అన్యాయంగా చెప్పడంతో అక్కడ ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ ఉద్యమం ఉధృతమైంది. ఆ ఉద్యమం సెగ యావత్ ప్రపంచాన్ని తాకింది. ఫెయిర్(తెలుపు) అనే పదంపై పెద్ద వివాదం నడుస్తోంది. దీంతో కంపెనీలు అలర్ట్ అవుతున్నాయి. ఫెయిర్ అనే పదాన్ని తొలగిస్తున్నాయి.

అదే విధంగా ‘స్కిన్‌ వైటెనింగ్‌’ ఉత్పత్తులను ఉపసంహరించుకుంటున్నామని ప్రముఖ కాస్మోటిక్‌ కంపెనీ ‘జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌’ కూడా ప్రకటించింది. వాటి ఉత్పత్తులకు మరిన్ని మిశ్రామాలను జోడించి, మరింత మెరుగ్గా మరో పేరుతో మార్కెట్లోకి తీసుకొస్తామని ఆ కంపెనీ తెలిపింది. ఆ కంపెనీ ‘చర్మ సౌందర్యం కోసం’ అంటుందా, మరో పేరు పెడుతుందా ? చూడాలి. ఈ రెండు కంపెనీల తరహాలోనే ‘వైటెనింగ్‌’ పేరిట లక్షల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న ఇతర కొస్మోటెక్‌ కంపెనీలు కూడా చర్మం రంగును తెలియజేసే పదాలన్నింటిని తామూ ఉపసంహరించుకుంటామని, వాటికి ‘స్కిన్‌ కేర్‌’ అని పేర్లు పెడతామని చెబుతున్నాయి.
https://10tv.in/cheater-phone-call-to-telangana-trs-mp-keshavarao-cheating-the-central-government-says-loans-to-the-unemployed/
పుట్టుకతో వచ్చే మనుషుల చర్మం రంగు మధ్యలో మారదని, మనిషి ఒక చోటు నుంచి మరో చోటుకు మరినప్పుడు అక్కడి ఉష్ణ లేదా శీతల పరిస్థితుల్లో చర్మం రంగులో కొంత మార్పు వస్తుందిగానీ, మందులతో మార్పు రాదని వైద్య విజ్ఞానం మొదటి నుంచి చెబుతున్నా నలుపును తెలుపు చేస్తామంటున్న వ్యాపారం మాత్రం జోరుగా కొనసాగుతూ వస్తోంది.