Gold Boom : రానున్న ఐదేళ్లలో లక్ష దాటనున్న బంగారం ధర

రానున్న రోజుల్లో బంగారం అమ్మకాల్లో బలమైన బూమ్ (Gold Boom) రానున్నదా?.. బంగారం ధరలు మరోసారి ఆశ్చర్యాన్ని కలిగించే స్థాయికి రాబోతున్నాయా?.. అవుననే అంటోంది స్పెయిన్‌కు చెందిన క్వాడ్రిగా ఫండ్‌ సంస్థ. రాబోయే ఐదేళ్లలో 10 గ్రాముల బంగారం ధర లక్ష దాటనుందని ఈ సంస్థ తెలిపింది.

Gold Boom : రానున్న ఐదేళ్లలో లక్ష దాటనున్న బంగారం ధర

Gold Boom

Gold Boom : గత ఐదేళ్లలో బంగారం ధరల్లో భారీగానే మార్పులు జరిగాయి. 2016లో రూ.30 వేలు ఉన్న 10 గ్రాముల బంగారం ధర 2020లో రూ.56 వేలకు చేరింది. ఆ తర్వాత కొన్ని ప్రతికూల పరిస్థితుల వలన రూ.50 వేల దిగువకు చేరింది. అయితే రాబోయే ఐదేళ్లలో బంగారం ధరల్లో భారీగా మార్పులు చోటుచేసుకుంటాయి స్పెయిన్ కు చెందిన క్వాడ్రిగా అనే సంస్థ తెలిపింది.

10 గ్రాముల బంగారం ధర లక్షకు చేరుతుందని అంచనా వేసింది. అంతర్జాతీయ మార్కెట్లో రాబోయే ఐదేళ్లలో బంగారం ధర ప్రతి ఔన్స్‌కు 3,000 డాలర్ల నుంచి 5000 డాలర్ల వరకు ఉంటుందని ఈ సంస్థ తెలిపింది. అంటే 10 గ్రాముల బంగారం ధర రూ.78,690 నుంచి రూ.131,140 లుగా ఉండనుంది. కాగా ప్రస్తుతం ఔన్స్ బంగారం 1,814 డాలర్లు ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,034 ఉంది.

అయితే 2016లో కూడా ఈ సంస్థ బంగారం ధరలను అంచనా వేసి చెప్పింది. రాబోయే ఐదేళ్లలో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుతాయని 2016లో అంచనా వేసి చెప్పింది. అప్పుడు ఈ సంస్థ వేసిన అంచనాలు సత్యమయ్యాయి. బంగారం ధర ఒకానొకదశలో గరిష్టంగా రూ.56 వేలకు చేరింది. అయితే ఈ సంస్థ అంచనాలను అమెరికాకు చెందిన యూఎస్‌బీ గ్రూప్ వ్యూహకర్తలు కొట్టిపడేస్తున్నారు. బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతాయని చెబుతున్నారు.

ఈ గ్రూప్ వ్యూహకర్తలు ఈ సంవత్సరం బంగారం మరింత తగ్గుతుందని, అది రూ.44,600 కి చేరుకుంటుందని చెప్పారు. ఈ క్షీణత 2022 లో కూడా కొనసాగుతుందని అంటున్నారు. అయితే, క్వాడ్రిగా ఫండ్ మేనేజర్లు మాత్రం తమ అంచనాకు కట్టుబడి ఉన్నట్లు చెప్పడం విశేషం. క్వాడ్రిగా అంచనాల ప్రకారం బంగారం ధర ఈ ఏడాది చివరి నాటికి రూ.55 వేలకు చేరనుంది.