Gold Price Today : పెరిగిన బంగారం ధర.. స్థిరంగా వెండి ధర

బంగారం ధర దేశ వ్యాప్తంగా పెరిగితే..తెలుగు రాష్ట్రాల్లో మాత్రం తగ్గింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో ఈ రోజు బంగారం ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి

Gold Price Today : పెరిగిన బంగారం ధర.. స్థిరంగా వెండి ధర

Gold Today Rates

Gold Price Today : భారతీయులకు బంగారానికి విడదీయలేని సంబంధం ఉంది. అలంకరణ కోసమే కాదు ఆర్థికంగా ఎదిగేందుకు కూడా బంగారం ఎంతగానో తోడ్పాటు ఇస్తుంది. బంగారంపై పెట్టుబడులు పెట్టి ధనవంతులైనవారు చాలామందే ఉన్నారు. ఇక బంగారం ధర విషయానికి వస్తే.. గత కొద్దీ రోజులుగా బంగారం ధరల్లో భారీ మార్పులేమీ చోటుచేసుకోలేదు. గడిచిన వారం రోజుల్లో మూడు రోజులు స్థిరంగా ఉండగా.. మరో నాలుగు రోజులు స్వల్పంగా పెరిగింది. ఇక సోమవారం ఉదయం ఆరు గంటలవరకు 10 గ్రాముల బంగారంపై రూ.10 పెరిగింది. ఆదివారం కూడా ఇదే విధంగా పెరిగింది. దేశంలో బంగారం ధరల్లో పెద్దగా మార్పులు లేకపోవడానికి అంతర్జాతీయ పరిణామాలే కారణమని చెబుతున్నారు నిపుణులు.

చదవండి : Gold Price Today : బంగారం ధర ప్రియం.. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ధరలు ఇలా

ఇక దేశ వ్యాప్తంగా వివిధ నగరాల్లోని బంగారం ధరలను పరిశీలిస్తే..

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,260లు ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,560లకు చేరుకుంది.
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,390లుఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,510 లు ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,780లు ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,780లు ఉంది
బెంగుళూరు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,110లు ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,210లు ఉంది
అహ్మదాబాద్ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,990లు ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,130లు ఉంది

చదవండి : Today Gold Price : స్థిరంగా బంగారం ధరలు.. స్వల్పంగా తగ్గిన వెండి ధర

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే..

హైదరాబాద్‌ 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర 46,790 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,790లుగా నమోదైంది
విజయవాడ 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర 46,790 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,790లుగా నమోదైంది
విశాఖపట్నం 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర 46,790 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,790లుగా నమోదైంది

చదవండి : Today Gold Price : శుభవార్త.. స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు

దేశంలో వెండి ధరలు నిన్నటికి నేటి ఏమాత్రం మార్పులేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో దేశంలో కిలో వెండి ధర ఆదివారం కూడా రూ. 61,200లు కొనసాగుతుంది.