Gold Price : పెరిగిన బంగారం.. దిగొచ్చిన వెండి

మంగళవారం బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ఇదే సమయంలో వెండి ధర తగ్గింది. మంగళవారం హైదరాబాద్ మార్కెట్లో  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.90 పెరిగి రూ.49,090కి చేరింది. ఇదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.10 పెరిగి రూ.45,000 కు చేరింది.

Gold Price : పెరిగిన బంగారం.. దిగొచ్చిన వెండి

Gold Price (5)

Gold Price : మంగళవారం బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ఇదే సమయంలో వెండి ధర తగ్గింది. మంగళవారం హైదరాబాద్ మార్కెట్లో  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.90 పెరిగి రూ.49,090కి చేరింది. ఇదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.10 పెరిగి రూ.45,000 కు చేరింది.

ఇక వెండి ధర తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండిపై రూ.300 తగ్గి.. రూ.72,900 కు పడిపోయింది. వెండి వస్తువులు కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు.

ఇక మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 0.41 శాతం పెరిగింది. దీంతో ఔన్స్ రేటు 1816 డాలర్లకు చేరింది. వెండి కూడా పెరిగింది. ఔన్స్‌కు 0.45 శాతం పెరుగుదలతో 25.25 డాలర్లకు చేరింది.

ఇక దేశ వ్యాప్తంగా ఉన్న ముఖ్యపట్టణాల్లోని బంగారం రేట్లను ఓ సారి పరిశీలిస్తే

దేశ ఆర్థిక రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,440 ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,040 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,440 ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,300 ఉంది
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,460 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,560 ఉంది.
.బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,090 ఉంది.
తిరువనంతపురం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,090 ఉంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,090 ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,090 ఉంది.