Today Gold Rate : శుభవార్త.. బంగారం ధర ఢమాల్‌

బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. ఒక్కరోజే 10 గ్రాముల బంగారంపై రూ.1,130 తగ్గింది. వెండిపై కూడా రూ.1,900 తగ్గింది

Today Gold Rate : శుభవార్త.. బంగారం ధర ఢమాల్‌

Gold Rate (2)

Today Gold Rate : బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కరోజే రూ.1,130 తగ్గింది. అంతర్జాతీయంగా బంగారం ధరలు పతనం కావడం వల్లనే దేశంలో బంగారం ధర తగ్గినట్లు బులియన్ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.రూ.49,690గా ఉన్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తెలిపింది. వెండి ధర కిలో రూ.708 తగ్గి రూ.60,183గా ఉన్నది. అంతకుముందు రోజు రూ.60,891గా ఉన్నది. ఇక హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారంపై రూ.650 తగ్గి రూ.47,350 దిగొచ్చింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.600 తగ్గి రూ.43,400లకు చేరింది. ఈ నెలలో ఇదే భారీ తగ్గుదల. ఇక వెండి ధర కూడా భారీగా పతనమైంది. హైదరాబాద్ లో కిలో వెండిపై ఈ ఒక్కరోజే ఏకంగా రూ.1,900 దిగి రూ.65,900లకు చేరింది. గురువారం కిలో వెండి ధర రూ.67,800 పలికింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 1,762 డాలర్లుగా, వెండి ధర 22.95 డాలర్లుగా ట్రేడ్‌ అవుతున్నది.

Read More : E-Auction : నీరజ్‌ ఈటె రూ. కోటి 55 లక్షలు, సింధు రాకెట్ రూ. 90 లక్షలు

ప్రధాన నగరాల్లో ధరల వివరాలు..

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,690గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,390 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,390గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,710 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,690గా ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,350గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350 ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350గా ఉంది.

Read More : Bihar : ఏక్ దిన్ కా కరోడ్ పతి..అకౌంట్లో రూ. 52 కోట్లు, కొంత ఇవ్వాలంటున్నాడు

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350గా ఉంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,400 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.47,350గా ఉంది.