Gold Price : స్థిరంగా బంగారం.. భారీగా తగ్గిన వెండి ధర

బంగారం ధర శనివారం నిలకడగా ఉంది. గత కొద్దీ రోజులుగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. అక్షయతృతీయ, దీపావళి, పెళ్లిళ్ల సీజన్ ఉండటంతో క్రమంగా బంగారం ధర పెరిగింది.

Gold Price : స్థిరంగా బంగారం.. భారీగా తగ్గిన వెండి ధర

Gold Price

Gold Price : బంగారం ధర శనివారం నిలకడగా ఉంది. గత కొద్దీ రోజులుగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. అక్షయతృతీయ, దీపావళి, పెళ్లిళ్ల సీజన్ ఉండటంతో క్రమంగా బంగారం ధర పెరిగింది. ఇక శుక్రవారం ధర స్వల్పంగా తగ్గగా శనివారం స్థిరంగా ఉంది. బంగారం ధరల్లో ఎటువంటి మార్పులేకపోవడం శుభవార్తే అని చెప్పవచ్చు. ఇక ఈ రోజు దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లోని బంగారం ధరలను ఒకసారి పరిశీలిస్తే..

హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 46,000ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,180కు చేరింది.
ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,150కు చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 52,530కు చేరింది.
చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర గోల్డ్ రేట్ రూ. 46,290కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,500కు చేరింది.

చదవండి : Gold Ornaments : సముద్ర తీరంలో బంగారు ఉంగరాలు, ముక్కుపుడకలు

ముంభైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 48,100కు చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 49,100కు చేరింది.
విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 46,000ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,180కు చేరింది.
విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 46,000ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,180కు చేరింది.

అయితే అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ధరలలో మార్పులు.. కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు.. వాటీ వడ్డీ రేట్లు.. వంటి అంశాలు పసిడి ధరలపై ప్రభావం చూపే అంశాలు. ఇక వెండి ధరల విషయానికి వస్తే .. వెండి ధర వెలవెలబోయింది. రూ.700 దిగొచ్చింది. దీంతో కేజీ వెండి ధర రూ.70,700కు తగ్గింది.

చదవండి : Gold Price : భారీగా పెరిగిన బంగారం వెండి ధరలు