Gold Price : బంగారం ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు

ఇన్నాళ్లు భారీ హెచ్చుత‌గ్గులు లేకుండా స్థిరంగా కొన‌సాగిన బంగారం ధ‌ర‌లు ఇవాళ మ‌ళ్లీ పెరిగాయి. దేశ రాజ‌ధాని ఢిల్లీలో తులం స్వ‌చ్ఛ‌మైన బంగారం ధ‌ర..

Gold Price : బంగారం ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు

Gold Price Today

Gold Price : కాలంతో పని లేదు. పండుగలతో నిమిత్తం లేదు. సీజన్ ఏదైనా మన దేశంలో బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఇక పెళ్లిళ్ల సీజ‌న్‌లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పసిడి ధరలు చుక్కలను తాకుతాయి. ధర ఎంత పెరిగినా…బంగారం కొనేందుకు ఆసక్తి చూపుతుంటారు. కాగా, పసిడి ధరల్లో రోజురోజుకు ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు తగ్గితే.. మరో రోజు పెరుగుతాయి. తాజాగా పసిడి ప్రియులకు షాక్ తగిలింది. పుత్తడి ధరలు పెరిగాయి.

ఇన్నాళ్లు భారీ హెచ్చుత‌గ్గులు లేకుండా స్థిరంగా కొన‌సాగిన బంగారం ధ‌ర‌లు ఇవాళ(సెప్టెంబర్ 15,2021) మ‌ళ్లీ పెరిగాయి. దేశ రాజ‌ధాని ఢిల్లీలో తులం స్వ‌చ్ఛ‌మైన బంగారం ధ‌ర రూ.438 పెరిగి రూ.46వేల 214కు చేరింది. క్రితం ట్రేడ్‌లో 10 గ్రాముల 24 క్యార‌ట్ గోల్డ్ ధ‌ర రూ.45వేల 776 దగ్గర ముగిసింది. అంత‌ర్జాతీయంగా విలువైన లోహాల ధ‌ర‌లు రాత్రికిరాత్రి పెరగ‌డ‌మే దేశీయంగా బంగారం ధ‌ర‌లు పెరుగ‌డానికి కార‌ణ‌మ‌ని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.

Surgical Masks : సర్జికల్‌ మాస్కులే మంచివి, కరోనా వ్యాప్తికి చెక్

వెండి ధ‌ర‌లు కూడా పెరిగాయి. ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధ‌ర రూ.633 పెరిగి రూ.62,140కి చేరింది. క్రితం ట్రేడ్ లో కిలో వెండి ధ‌ర రూ.61,507 దగ్గర ముగిసింది. ఇక‌ అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధ‌ర 1,802 అమెరిక‌న్ డాల‌ర్లు, ఔన్స్ వెండి ధ‌ర 23.79 అమెరిక‌న్ డాల‌ర్లు ప‌లికింది.

హైద‌రాబాద్‌లో బంగారం ధ‌ర‌లు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల 24 క్యార‌ట్ బంగారం ధ‌ర రూ.47,990 ఉండ‌గా, 10 గ్రాముల 22 క్యార‌ట్ బంగారం ధ‌ర రూ.43,990గా ఉంది.

కరోనా మన జీవితాల్లో భాగంగా ఉండిపోతుందా? పెరుగుతున్న డెల్టా వేరియంట్ కేసులకు ఇదే నిదర్శనమా?

ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. పుత్తడిని కొనుగోలు చేయడానికి చాలా మంది ఇష్టపడతారు. ఇక భారతీయులకు అత్యంత ప్రియమైనది పసిడి. మహిళలు గోల్డ్ కి అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తుంటారు. ధర ఎంత పెరిగినా భారతీయులు బంగారం కొనుగోళ్లు మాత్రం ఆపరు.

బంగారం ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల దగ్గరున్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.